చైనాకు కొత్త కష్టం వచ్చింది. అక్కడి వాతావరణంలో ఊహించని మార్పులు మొదలయ్యాయి. చైనా జాతీయ వాతావరణ కేంద్రం సోమవారం ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. దేశంలోని అనేక ప్రాంతాలలో తీవ్రమైన వేడి గాలుల కారణంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోయాయి.
సిచువాన్, చాంగ్‌కింగ్, షాంగ్‌సీ, షాన్‌డాంగ్, హెనాన్, అన్‌హుయ్, జియాంగ్‌సు, షాంఘై, హుబీ, గుయిజౌ, హునాన్, జియాంగ్‌సీ, జెజియాంగ్, ఫుజియాన్, గ్వాంగ్‌సీ, గ్వాంగ్‌డాంగ్, జిన్‌జియాంగ్‌లోని కొన్ని ప్రాంతాల్లో 35 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
షాంగ్సీ, హుబీ, చాంగ్‌కింగ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను అధిగమించనున్నాయి.
అధిక-ఉష్ణోగ్రత కారణంగా ప్రజలు బహిరంగ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కేంద్రంసూచించింది. ఆరుబయట అధిక ఉష్ణోగ్రతలల్లో గడిపే సమయాన్ని తగ్గించుకోవాలని సూచించారు. విద్యుత్తును అధికంగా వినియోగించడం వల్ల వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లపై అధిక విద్యుత్ లోడ్ కలిగి మంటలు చెలరేగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.