మార్స్ పై దిగిన చైనా రోవర్

China lands its Zhurong rover on Mars. అంగారక యాత్రలో చైనా విజయం సాధించింది. ఏడు నెలల అంతరిక్ష ప్రయాణం తర్వాత చైనాకు

By Medi Samrat  Published on  15 May 2021 9:09 AM GMT
మార్స్ పై దిగిన చైనా రోవర్

అంగారక యాత్రలో చైనా విజయం సాధించింది. ఏడు నెలల అంతరిక్ష ప్రయాణం తర్వాత చైనాకు చెందిన ఝురోంగ్ రోవర్ శనివారం ఉదయం విజయవంతంగా అంగారక గ్రహంపై కాలు మోపింది. చైనా జాతీయ అంతరిక్ష పరిపాలన విభాగం ఈ విషయాన్ని ధృవీకరించింది. మార్స్‌పై తమ రోవర్‌ని ప్రవేశ పెట్టిన వారిలో మొదటి స్థానం అమెరికాది కాగా తర్వాత స్థానంలో చైనా నిలిచింది.

చైనా తొలి మానవసహిత అంతరిక్ష నౌక తియాన్వేన్ -1 తీసుకు వెళ్ళిన ఈ రోవర్ పేరు ఝురోంగ్. చైనా పురాణాల ప్రకారం ఝురోంగ్ అంటే గాడ్ ఆఫ్ ఫైర్.. అంటే చైనీయుల అగ్ని దేవుడు. ఈ రోవర్ శనివారం ఉదయం ముందస్తు వ్యూహం ప్రకారం ఏ నిర్దేశిత ప్రదేశంలో అయితే రోవర్‌ను ల్యాండ్ చేయాలని భావించారో అక్కడే మార్స్‌పై ల్యాండ్ అయినట్లు చైనా ప్రభుత్వ మీడియా స్పష్టం చేసింది.

ఆరు చక్రాలు కలిగి ఉన్న ఝురోంగ్ బరువు 240 కిలోగ్రాములు. ఇది ఆరు ముఖ్యమైన పరికరాలను తనతో మోసుకెళ్లింది. సోలార్ విద్యుత్ సహాయంతో పని చేసే ఈ రోవర్ తన మిషన్‌లో భాగంగా అంగారకుడి ఉపరితలంపై పురాతన జీవనంపై ఆధారాల కోసం అన్వేషిస్తుంది. తియాన్వేన్ -1 ఆర్బిటార్ నుంచి రోవర్‌కు సంకేతాలు అందుతాయి. దీని ఆధారంగా చేసుకుని అంగారక గ్రహంను మొత్తం ఓ రౌండ్ వేస్తుంది. అంగారక ఉపరితలంపై శిలాజాలు, పలు నమూనాలు సేకరిస్తుంది.




Next Story