ఆహారం నిల్వ చేసుకోండి.. చైనా ప్రభుత్వం హెచ్చరిక..!
China Is Urging Families To Stock Up On Food. ఆహార పదార్థాలతో పాటు ఇతర నిత్యావసర వస్తువులను నిల్వ చేసుకోవాలని చైనా ప్రభుత్వం.. తమ దేశ ప్రజలకు సూచన చేసింది.
By అంజి Published on 3 Nov 2021 3:19 PM IST
ఆహార పదార్థాలతో పాటు ఇతర నిత్యావసర వస్తువులను నిల్వ చేసుకోవాలని చైనా ప్రభుత్వం.. తమ దేశ ప్రజలకు సూచన చేసింది. ఇంధనం కొరత, కరోనా నిబంధనలు, వెదర్ అనూకలంగా లేకపోవడం వల్ల ట్రాన్స్‌పోర్ట్ సమస్యలు ఏర్పడే ఛాన్స్ ఉందని చైనా పేర్కొంది. ఈ మేరకు చైనా ప్రభుత్వ వాణిజ్య శాఖ ప్రకటన చేసింది. స్థానిక ప్రభుత్వాలు దగ్గరుండి ప్రజలు నిత్యావసరాలను నిల్వ చేసుకునేలా చూడాలని ఆదేశాల్లో పేర్కొంది. వెజిటెబుల్స్, వంట నూనెలు, పౌల్ట్రీ ఉత్పత్తులు వంటి వాటిని నిల్వ చేసుకోవాలని చెప్పింది.
రోజువారీగా వాడే వస్తువులను తెచ్చుకొని నిల్వ ఉంచుకోవాలని ప్రభుత్వం చెప్పింది. వచ్చే సంవత్సరం ఎండాకాలం వచ్చే వరకు నిత్యావసర సరుకుల్లో కొరత లేకుండా చూసుకోవాలని రూరల్ ప్రభుత్వాలకు సూచించింది. అయితే సడన్‌గా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చైనా ప్రజలు షాక్‌కు గురయ్యారు. మరోవైపు తైవాన్‌తో తగువు కారణంగానే ఈ నిర్ణయం తీసుకుందని కొందరు అంటున్నారు. నిత్యావసరాల స్టాక్ పెట్టుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలను.. ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ప్రభుత్వాధికారి తెలిపారు. ఇదిలా ఉంటే కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో.. చైనా ప్రభుత్వం కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది.
ఈ క్రమంలోనే ఆహారధాన్యాల ధరలు పెరిగాయని మరో అధికారి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల చైనా దేశంలో భారీ వర్షాలు కురిసాయి. ముఖ్యంగా అతి పెద్ద కూరగాయలు పండించే ప్రాంతం అయిన షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లో విస్తార వర్షాలు కురవడంతో పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో పాటు చైనా వాతావరణ సమస్యలను ఎదుర్కొంటొంది. గ్లోబల్ వార్మింగ్‌కు చైనా ప్రపంచంలోనే అతిపెద్ద సహకారి. కానీ ప్రస్తుతం అక్కడ విభిన పరిస్థితి కనిపిస్తోంది. ఆహార సరఫరా కొరత, ధరల పెరుగుదల ఆందోళనలకు తోడుగా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. చైనా దేశ రాజధాని బీజింగ్‌తో సహా 14 ప్రావిన్సులలో పలు చోట్ల లాక్‌డౌన్‌లు విధించారు.