అమెరికా వస్తువులపై సుంకాలను 125 శాతానికి పెంచిన చైనా
చైనా వస్తువులపై 145% సుంకం విధించిన అమెరికాపై చైనా ప్రతీకారం తీర్చుకుంది.
By Medi Samrat
చైనా వస్తువులపై 145% సుంకం విధించిన అమెరికాపై చైనా ప్రతీకారం తీర్చుకుంది. చైనా శుక్రవారం అమెరికా దిగుమతులపై అదనపు సుంకాన్ని 125 శాతానికి పెంచింది. దిగుమతి చేసుకునే అమెరికా ఉత్పత్తులపై చైనా అదనపు సుంకాన్ని 125 శాతానికి పెంచినట్లు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అమెరికా ఉత్పత్తులపై చైనా గతంలో 84 శాతం సుంకాన్ని ప్రకటించింది.
అమెరికా సుంకాన్ని పెంచిన తర్వాత.. చైనా ప్రపంచ వాణిజ్య సంస్థలో వ్యాజ్యం దాఖలు చేసిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు కొత్త అమెరికా నోటిఫికేషన్ ప్రకారం.. చైనాపై విధించిన వాణిజ్య సుంకం 145 శాతంకు చేరుకుంది.
అంతకుముందు చైనా 84 శాతం సుంకం విధించడం.. కొన్ని అమెరికన్ చిత్రాల దిగుమతిని నిషేధించడం ద్వారా ప్రతీకారం తీర్చుకుంది.. అలాగే సమస్యను పరిష్కరించడానికి చర్చలు జరపాలని తన ఆసక్తిని వ్యక్తం చేసింది. కాగా.. ట్రంప్ విధించిన సుంకాలపై ప్రతీకారం తీర్చుకున్న ఏకైక దేశం చైనా కావడం విశేషం.
చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ శుక్రవారం మాట్లాడుత.. యుఎస్ "బెదిరింపు" ను నిరోధించడానికై బీజింగ్‌లో రావాలని యూరోపియన్ యూనియన్‌కు పిలుపునిచ్చారు. "టారిఫ్ యుద్ధంలో విజేతలు ఎవరూ లేరు" అని అన్నారు.
"చైనా, EU ఆర్థిక ప్రపంచీకరణ, స్వేచ్ఛా వాణిజ్యానికి దృఢమైన మద్దతుదారులు" అని స్పానిష్ ప్రధాన మంత్రి పెడ్రో శాంచెజ్‌తో జరిగిన సమావేశంలో జి జిన్‌పింగ్ అన్నారు. "టారిఫ్ యుద్ధంలో విజేతలు ఎవరూ లేరు" అని జి చెప్పారు. "ఏకపక్ష బెదిరింపు"ను సంయుక్తంగా వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. గ్లోబల్ టారిఫ్‌లను అమెరికా విపరీతంగా పెంచడాన్ని జీ ప్రస్తావించారు.