దారుణం : బట్టలు మార్చుకుంటున్న‌ మహిళను అలాగే అర‌గంట‌పాటు విచారించిన పోలీసులు..

Chicago expected to pay woman $2.9M over botched police raid. అమెరికాలోని ఓ నల్లజాతి మహిళతో పోలీసులు అనుచితంగా ప్రవర్తించినందుకు చికాగోలోని

By Medi Samrat  Published on  15 Dec 2021 9:16 AM GMT
దారుణం : బట్టలు మార్చుకుంటున్న‌ మహిళను అలాగే అర‌గంట‌పాటు విచారించిన పోలీసులు..

అమెరికాలోని ఓ నల్లజాతి మహిళతో పోలీసులు అనుచితంగా ప్రవర్తించినందుకు చికాగోలోని పోలీసులకు 2.9 మిలియన్ డాలర్లు (రూ. 22 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది. బాధితురాలు పోలీసులపై కేసు పెట్టగా, పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసు 2019 సంవత్సరం నాటిది, కొంతమంది పోలీసు అధికారులు నేరస్థుడి కోసం వెతుకుతూ మహిళ ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించారు. ఆమె సామాజిక కార్యకర్త, ఆ సమయంలో బట్టలు మార్చుకుంటోంది. పోలీసులు ఆమెకు సంకెళ్లు వేసి బట్టలు లేకుండా నిలబెట్టారు. కట్టుబట్టలతో సుమారు అరగంటపాటు ఆమెను విచారించారు. ఆ తర్వాత పోలీసులు వెతుకుతున్న నేరస్థుడు ఆ ఇంట్లో కాకుండా పక్క ఇంట్లో ఉంటున్నాడని తేలింది. ఈ సంఘటనతో మహిళ తీవ్ర అవమానానికి గురైంది. ఫిబ్రవరి 2021లో, పోలీసు అధికారులు తనతో అనుచితంగా ప్రవర్తించారని, తనను అవమానించారని ఆరోపిస్తూ ఆమె దావా వేసింది. విచారణలో ఆమె 12 మంది పోలీసులను ప్రతివాదులుగా చేసింది.

కేసును విచారించిన తర్వాత, ఇన్‌ఫార్మర్ సమాచారాన్ని ధృవీకరించడంలో పోలీసులు విఫలమయ్యారని, మహిళ అవమానాలు, వేధింపులను ఎదుర్కోవలసి వచ్చిందని కోర్టు తన నిర్ణయంలో పేర్కొంది. పోలీసుల దుష్ప్రవర్తనకు గాను ఆ మహిళకు $2.9 మిలియన్ల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. చికాగో సిటీ కౌన్సిల్ కమిటీ సోమవారం నాడు సమావేశమై 2019లో తన ఇంటిపై దాడి చేసిన సమయంలో పోలీసు అధికారులచే నగ్నంగా చేతికి సంకెళ్లు వేయబడిన మహిళకు $2.9 మిలియన్లు చెల్లించాలని సిఫార్సు చేసింది. సామాజిక కార్యకర్త ఆంజనేట్ యంగ్ కోసం పరిష్కారాన్ని సిఫార్సు చేయడానికి ఫైనాన్స్ కమిటీ యొక్క ఏకగ్రీవ ఆమోదాన్ని పూర్తి సిటీ కౌన్సిల్ బుధవారం పరిగణించబడుతుంది. Ms. యంగ్ కు జరిగిన అవమానాన్ని తాము తీవ్రంగా తప్పుబడుతూ ఉన్నామని చికాగో సిటీ కౌన్సిల్ కమిటీ తెలిపింది.


Next Story