తీవ్రవాదులు ఉన్నారంటూ మెయిల్.. అప్పటికే చెన్నై నుండి కొలంబోకు వెళ్లిన విమానం

ఐదుగురు అనుమానిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఉన్నట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో చెన్నై నుండి వచ్చిన శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ విమానం కొలంబోలోని బండరానాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో ముమ్మర తనిఖీలు చేసినట్లు అధికారులు తెలిపారు.

By Medi Samrat
Published on : 3 May 2025 9:08 PM IST

తీవ్రవాదులు ఉన్నారంటూ మెయిల్.. అప్పటికే చెన్నై నుండి కొలంబోకు వెళ్లిన విమానం

ఐదుగురు అనుమానిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఉన్నట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో చెన్నై నుండి వచ్చిన శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ విమానం కొలంబోలోని బండరానాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో ముమ్మర తనిఖీలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడుల తర్వాత భారతదేశంలో నిఘా పెంచిన నేపథ్యంలో, శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఐదుగురు లష్కరే తీవ్రవాదులు ఉన్నారని పేర్కొంటూ చెన్నై విమానాశ్రయ అధికారులకు బెదిరింపు ఇమెయిల్ రావడంతో అధికారులు భద్రతా చర్యలు తీసుకున్నారు.

ఈమెయిల్ అందే సమయానికి విమానం ఇప్పటికే బయలుదేరి వెళ్లింది. ఆ సమాచారాన్ని కొలంబో విమానాశ్రయానికి పంపారు, అక్కడ పూర్తి భద్రతా తనిఖీలు నిర్వహించి, ప్రయాణీకులను దించేశారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు ఏవీ కనుగొనకపోవడంతో ఆ సందేశం నకిలీదని తేలింది. శ్రీలంక ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తమ విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి, తదుపరి కార్యకలాపాలకు అనుమతి ఇచ్చిందని తెలిపింది.

Next Story