ఈ వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం

Cheetah slams into window as it tries to pounce on toddler in safari lodge in UK. వెన్నులో వణుకు పుట్టించే వీడియో ఇది. UKలోని వోర్సెస్టర్‌షైర్‌లో ఒక చిరుత

By Medi Samrat  Published on  18 Feb 2022 10:10 AM GMT
ఈ వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం

వెన్నులో వణుకు పుట్టించే వీడియో ఇది. UKలోని వోర్సెస్టర్‌షైర్‌లో ఒక చిరుత పసిబిడ్డపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. బెవ్డ్లీలోని వెస్ట్ మిడ్‌లాండ్స్ సఫారీ పార్క్‌లోని సఫారీ లాడ్జ్‌లో షాకింగ్ వీడియో రికార్డ్ చేయబడింది. ఈ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా మారింది. నెటిజన్లను భయభ్రాంతులకు గురి చేసింది. క్లిప్‌లో ఒట్టో అనే పసిపిల్లవాడు సఫారీ లాడ్జ్‌లోని గది లోపల నేలపై పాకుతూ ఉన్నట్లుగా వీడియో ఉంది. కొన్ని సెకన్ల తర్వాత, ఒక చిరుత పిల్లవాడిపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించింది.


అయితే ఆ పిల్లాడికి చిరుతకు మధ్య గాజుతో కట్టిన గోడ ఉండడం మీరు చూడవచ్చు. ఒట్టో తండ్రి బెన్ మిల్లర్ ఈ వీడియోను చిత్రీకరించారు. "మేము అద్దెకు తీసుకున్న సఫారీ లాడ్జ్‌లో నా కొడుకు కిటికీ ముందు పాకుతున్నాడు. రాత్రి చీకటిలో అక్కడ ఏదో ఉన్నట్లు అనిపించింది. సెకన్లు గడిచిపోయాయి, ఆ తర్వాత చీకటిలో నుండి, చిరుత అతని ఎదురుగా ఉన్న కిటికీలోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ రీన్‌ఫోర్స్డ్ గ్లాస్ అడ్డుగా ఉంది" అని మిల్లర్ డైలీ మెయిల్‌తో చెప్పారు. వెస్ట్ మిడ్‌లాండ్స్ సఫారీ పార్క్‌లో అస్రాయెల్, బప్పే అనే రెండు చిరుతలు ఉన్నాయి. లాడ్జిలో బస చేసే పర్యాటకులు వాటిని ఎప్పటికప్పుడు చూడవచ్చు.


Next Story