కదిలిన 'ఎవర్ గివెన్' కంటైనర్
Canal service provider says container ship in Suez set free. సూయజ్ కాల్వలో ఆరు రోజులుగా చిక్కుకుపోయిన ఎవర్ గివెన్ కంటైనర్ ఎట్టకేలకు కదిలింది.
By Medi Samrat Published on 30 March 2021 8:10 AM ISTసూయజ్ కాల్వలో ఆరు రోజులుగా చిక్కుకుపోయిన ఎవర్ గివెన్ కంటైనర్ ఎట్టకేలకు కదిలింది. ప్రమాదం సమయంలో నౌక ముందు భాగం ఒక వైపు ఒడ్డున ఉన్న ఇసుకలో కూరుకుపోయింది. అంత భారీ నౌక నేలను తాకడంతో కదిలించడం అత్యంత శ్రమతో కూడిన వ్యవహారంగా మారింది. అయితే ఇన్ని రోజులుగా టగ్ బోట్లు, డ్రెడ్జర్లతో సూయజ్ పోర్టు అధికారులు అలుపెరుగకుండా ప్రయత్నిస్తుండడంతో అది 29 మీటర్లు పక్కకు కదిలింది. నౌక ముందుభాగం వద్ద భారీగా ఇసుక, బురదను తవ్వేసి నీరు పారేట్లు చేశారు. దీంతో నౌక తేలిగ్గా కదలడం మొదలుపెట్టింది.
Traffic resumes in the Suez Canal after the Ever Given is re-floated, Egypt's Suez Canal Authority chairman says https://t.co/OSOucKWbcG pic.twitter.com/7kQUO2xSZv
— Reuters (@Reuters) March 29, 2021
అదే సమయంలో నౌక వెనుక భాగాన్ని ఒక వైపునకు నెట్టడంతో దాదాపు 80శాతం సరైన దిశలోకి వచ్చేసిందని ఈజిప్టు టుడే మ్యాగ్జెన్ ట్వీట్ చేసింది.ఈ నౌక పూర్తిగా మార్గంలోకి రాగానే బిట్టర్ లేక్ వద్దకు తరలిస్తారని సమాచారం. ఉదయాన్నే సముద్రపు పోటు వచ్చి నీటి మట్టం పెరగ్గానే రాకపోకలు మొదలయ్యే అవకాశాలు ఉందని సుయిజ్ కెనాల్ అథారిటీ చెబుతోంది.
The stranded container ship blocking the #SuezCanal was re-floated and is currently being secured, Inch Cape Shipping Services says in a tweet.https://t.co/PmPvRx2o5B pic.twitter.com/WrYm7m6pKX
— Al Arabiya English (@AlArabiya_Eng) March 29, 2021
కాగా మంగళవారం నుంచీ ఇప్పటివరకూ సూయజ్ కెనాల్‌లో దాదాపు 350 నౌకలు జామ్ అయినట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రతి రోజు సూయిజ్ కెనాల్ అథారిటీకి 14 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోంది. దీనికి రవాణాను వేగంగా పునరుద్ధరించడానికి అమెరికా, చైనా, గ్రీస్, యూఏఈలు సహకరిస్తున్నాయి. ఈ ప్రమాదానికి ఇసుక తుఫానుతోపాటు.. మానవ, సాంకేతిక తప్పిదాలు కూడా ఉన్నాయని సూయిజ్ కెనాల్ అథారిటీ బోర్డు అధిపతి పేర్కొన్నారు.