భారత విమానాలపై నిషేధం ఎత్తివేత

Canada Lifts Ban On Direct Flights From India. భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం ఎత్తేస్తున్నట్లు కెనడా ప్రభుత్వం తెలిపింది. భారత్‌లో

By Medi Samrat  Published on  26 Sep 2021 12:16 PM GMT
భారత విమానాలపై నిషేధం ఎత్తివేత

భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం ఎత్తేస్తున్నట్లు కెనడా ప్రభుత్వం తెలిపింది. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ఈ నిషేధాన్ని కెనడా అమలు చేసింది. ఐదు నెలలపాటు బ్యాన్ కొనసాగించిన కెనడా.. ఇప్పుడు తొలగిస్తున్నట్లు తెలిపింది. భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులు అనుమతి పొందిన ల్యాబొరేటరీల నుంచి కరోనా నెగిటివ్ ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని కెనడా సూచించింది. ఈ పరీక్షలను ప్రయాణానికి 18 గంటల ముందు చేయించుకోవాలని చెప్పింది.

మెరుగైన కొవిడ్‌ ప్రోటోకాల్స్‌ను దృష్టిలో పెట్టుకొని నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. సోమవారం నుంచి ఇరుదేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని ఆదివారం తెలిపింది. కెనడా జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం.. ప్రయాణికులు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కెనడా ఆమోదించిన జెన్‌స్ట్రింగ్‌ ల్యాబ్‌ నుంచి కొవిడ్‌ టెస్ట్‌ (మాలిక్యులర్‌) చేయించుకోవాలి ఉంటుంది. ఇందులో నెగెటివ్‌ వస్తేనే ప్రయాణానికి అనుమతి ఇస్తారు.

కెనడాకు విమానం బయలుదేరే 18 గంటల ముందు పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. భారత్‌లో ఇతర ల్యాబ్‌ల్లో తీసుకున్న కొవిడ్‌ టెస్ట్‌ రిపోర్ట్‌ను పరిగణలోకి తీసుకోరు. పూర్తిగా టీకాలు తీసుకున్న ప్రయాణికులు Arrivecan app లేదా వెబ్‌సైట్‌లో సంబంధిత సమాచారాన్ని అప్‌లోడ్‌ చేయాలి. దీన్ని అధికారులు ధ్రువీకరించి, విమానం ఎక్కేందుకు అనుమతి ఇస్తారు. ఈ నెల 30 నుంచి ఎయిర్‌ ఇండియా కెనడాకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించనుంది.


Next Story