అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ వార్ ను మొదలుపెట్టారు. శనివారం మెక్సికో, కెనడా నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై 25 శాతం, చైనా నుండి దిగుమతులపై 10 శాతం భారీ కొత్త సుంకాలను విధించే ఉత్తర్వుపై సంతకం చేశారు. $2.1 ట్రిలియన్ల వార్షిక వాణిజ్యానికి అంతరాయం కలిగించే వాణిజ్య యుద్ధాన్ని రేకెత్తిస్తుంది. ఈ ఉత్తర్వులు ఉత్తర అమెరికా అంతటా వ్యాపారాలకు అంతరాయం కలిగించవచ్చు.
డోనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లపై మూడు వేర్వేరు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లపై సంతకం చేశారు. ఇది కొత్త వాణిజ్య యుద్ధానికి దారితీసింది. "మేము అమెరికన్లను రక్షించాల్సిన అవసరం ఉంది. అందరి భద్రతను నిర్ధారించడం అధ్యక్షుడిగా నా కర్తవ్యం. మా సరిహద్దుల్లో అక్రమ వ్యాపారాలు, డ్రగ్స్ తరలింపును ఆపడానికి నేను నా ప్రచారంలో భాగంగా వాగ్దానం చేసాను. అమెరికన్లు అత్యధికంగా దీనికి అనుకూలంగా ఓటు వేశారు.' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.