బాత్‌రూమ్‌లో కూడా కెమెరాలను ఉంచారు : నవాజ్ షరీఫ్ కుమార్తె

Cameras Were Installed In My Jail Cell Bathroom. పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పిఎంఎల్-ఎన్) ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్

By Medi Samrat  Published on  13 Nov 2020 11:31 AM GMT
బాత్‌రూమ్‌లో కూడా కెమెరాలను ఉంచారు : నవాజ్ షరీఫ్ కుమార్తె

పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పిఎంఎల్-ఎన్) ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్ షరీఫ్ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం మీద సంచలన ఆరోపణలు చేశారు. చౌదరి షుగర్ మిల్స్ కేసులో నవాజ్‌ షరీఫ్ గతేడాది అరెస్ట్‌ అయినప్పుడు తనను నిర్భందించిన జైలు గది సహా బాత్రూమ్‌లోనూ అధికారులు కెమెరాలను ఏర్పాటు చేశారని అన్నారు. తాను రెండుసార్లు జైలు జీవితం గడిపానని.. ఓ మహిళగా తనతో ఎలా వ్యవహరించారు అన్నదానిపై మాట్లాడితే, వారికి ముఖాలు చూపించే ధైర్యం కూడా ఉండదని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని (పిటిఐ) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది.

తన తండ్రి సమక్షంలోనే తనను అరెస్ట్‌ చేసి, వ్యక్తిగతంగా దాడి చేశారంటే ఇక పాకిస్తాన్‌లోని ఏ మహిళకు రక్షణ లేదని ఆరోపించింది. అధికారులు నా గదిలోకి బలవంతంగా దూరి.. నిజం మాట్లాడినందుకు నా తండ్రి ముందే అరెస్ట్ చేస్తే.. జైలు గదుల్లో, బాత్‌రూమ్‌లో కెమెరాలు పెడితే ప్రైవేటుగా దాడి చేయవచ్చని అన్నారు. ఒక మహిళ పాకిస్తాన్‌లో కానీ, మరో దేశంలో కానీ ఏ మాత్రం బలహీనురాలు కాదని ఆమె అన్నారు.

పాక్‌లో ప్రస్తుతమున్న ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగించడానికి సైనిక అధికారులతో చర్చలు జరపడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని ఆమె అన్నారు. ప్రస్తుత పిటిఐ ప్రభుత్వాన్ని అధికారం నుండి తొలగిస్తే, రాజ్యాంగ పరిధిలో సైన్యంతో చర్చించేందుకు తమ పార్టీ సిద్దమేనన్నారు.


Next Story