భారీ అగ్నిప్ర‌మాదం.. 10 బ‌స్సులు ద‌గ్ధం

Buses burn, transformers explode after massive fire breaks out at Los Angeles pallet yard. అగ్ర‌రాజ్యం అమెరికాలో భారీ

By Medi Samrat  Published on  27 Feb 2021 5:08 AM GMT
భారీ అగ్నిప్ర‌మాదం.. 10 బ‌స్సులు ద‌గ్ధం

అగ్ర‌రాజ్యం అమెరికాలో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. కాలిఫోర్నియాలోని ఓ పారిశ్రామిక‌వాడ‌లో శుక్ర‌వారం తెల్ల‌వారుజామున ఈ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. చెక్క పెట్టెల త‌యారీ ప‌రిశ్ర‌మ‌లో ఆక‌స్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో ఆ ప‌రిశ్ర‌మతో పాటు ప‌క్క‌నున్న కంపెనీల‌కు మంట‌లు వేగంగా వ్యాపించాయి. ఈ అగ్నిప్ర‌మాదంలో 10 బ‌స్సుల‌తో పాటు ప‌క్క‌నే ఉన్న‌ ప‌రుపుల త‌యారీ ప‌రిశ్ర‌మ పూర్తిగా ద‌గ్ధ‌మ‌య్యాయి. దీంతో భారీగా ఆస్థి న‌ష్టం వాటిల్లింది.

త‌గ‌ల‌బ‌డ్డ బ‌స్సుల‌లో స్కూల్‌ బ‌స్సులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ప‌లు ట్రాన్స్‌ఫార్మ‌ర్లు, క‌రెంట్ స్తంభాలు పూర్తిగా ద‌గ్ధ‌మ‌య్యాయి. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని, నాలుగు గంట‌ల పాటు శ్ర‌మించి మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చారు. మంట‌లు ఆర్పుతున్న క్ర‌మంలో అగ్రిమాప‌క సిబ్బందికి స్వ‌ల్ప గాయాల‌య్యాయి.

ఈ ప్ర‌మాదంలో ప‌క్క‌నే ఉన్న ఇళ్ల‌‌కు, అపార్ట్‌మెంట్స్‌కు ఎలాంటి ప్ర‌మాదం సంభ‌వించ‌క‌పోవ‌డం.. ఎటువంటి ప్రాణ‌న‌ష్టం జ‌రుగ‌క‌పోవ‌డంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. మంట‌లు వేగంగా వ్యాప్తి చెందుతున్న స‌మ‌యంలోనే స‌మీప దుకాణ స‌ముదాయాల‌ను మూసేసి.. కార్మికుల‌ను అక్క‌డి నుండి ఖాళీ చేయించారు. అగ్నిప్ర‌మాదంలో భారీగా ఆస్థి న‌ష్టం జ‌రిగింది. ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు తెలియాల్సివుంది.
Next Story