30,000 అడుగుల ఎత్తులో.. నగ్నంగా నృత్యం చేస్తూ పట్టుబడ్డాడు..!

శాన్ ఫ్రాన్సిస్కో నుండి లండన్ హీత్రూకు వెళుతున్న విమానంలో బిజినెస్ క్లాస్ టాయిలెట్‌లో నగ్నంగా నృత్యం చేస్తూ కనిపించిన బ్రిటిష్ ఎయిర్‌వేస్ స్టీవార్డ్‌ను అరెస్టు చేశారు.

By Medi Samrat
Published on : 31 May 2025 8:26 PM IST

30,000 అడుగుల ఎత్తులో.. నగ్నంగా నృత్యం చేస్తూ పట్టుబడ్డాడు..!

శాన్ ఫ్రాన్సిస్కో నుండి లండన్ హీత్రూకు వెళుతున్న విమానంలో బిజినెస్ క్లాస్ టాయిలెట్‌లో నగ్నంగా నృత్యం చేస్తూ కనిపించిన బ్రిటిష్ ఎయిర్‌వేస్ స్టీవార్డ్‌ను అరెస్టు చేశారు. ఈ సంఘటన విమానం గాలిలో ఉన్నప్పుడు జరిగింది. స్టీవార్డ్ మాదకద్రవ్యాల ప్రభావంలో ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

అతడు కనిపించకపోవడంతో మిగిలిన సిబ్బంది వెతకడం మొదలు పెట్టింది. అయితే అతడు క్లబ్ వరల్డ్ క్యాబిన్ రెస్ట్‌రూమ్‌లో దుస్తులు లేకుండా ఉన్నట్లు గుర్తించారు. అతడిని అదుపు చేయడానికి చేసిన ప్రయత్నంలో లగ్జరీ సీటులో నిర్బంధించారు.

ల్యాండింగ్ తర్వాత, అతన్ని పోలీసులు అరెస్టు చేసి వైద్య సహాయం అందించారు. ఎయిర్‌బస్ A380 విమానంలో దాదాపు 470 మంది ఉన్నారు. అతని గైర్హాజరీ కారణంగా తోటి సిబ్బంది విరామం లేకుండా పని చేయాల్సి వచ్చింది. స్టీవార్డ్‌ను సస్పెండ్ చేసినట్లు బ్రిటిష్ ఎయిర్‌వేస్ ధృవీకరించింది. ఈ విషయం ఇప్పుడు పోలీసు దర్యాప్తులో ఉంది.

Next Story