అలా బ్రిడ్జిని ప్రారంభించారు.. ఇలా కూలిపోయింది..!

Bridge Collapses In Congo During Inauguration. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC)లో ఒక బ్రిడ్జిని ప్రారంభించేందుకు అధికారులు వచ్చారు.

By Medi Samrat  Published on  7 Sep 2022 3:00 PM GMT
అలా బ్రిడ్జిని ప్రారంభించారు.. ఇలా కూలిపోయింది..!

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC)లో ఒక బ్రిడ్జిని ప్రారంభించేందుకు అధికారులు వచ్చారు. ఆ బ్రిడ్జిపై నిలబడ్డారు. ఇంతలోనే అది కాస్తా కూలిపోయిందని స్థానిక ఖామా ప్రెస్ వార్తా సంస్థ తెలిపింది. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నిర్మాణ నాణ్యతపై ప్రజలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. వర్షాకాలంలో స్థానికులు నదిని దాటేందుకు ఈ చిన్న వంతెనను నిర్మించారు. వంతెనకు ముందు ఉన్న తాత్కాలిక నిర్మాణం తరచుగా విరిగిపోయేదని వార్తా సంస్థ తన నివేదికలో పేర్కొంది. అధికారిక కార్యక్రమంలో ప్రారంభించేందుకు అధికారులు వంతెనపై నిలబడి ఉన్నారు.. బ్రిడ్జికి ఒక చివర ఎర్ర రిబ్బన్ కట్టారు. దాన్ని కత్తిరించి ప్రారంభోత్సవం చేయాలని అనుకున్నారు.

కానీ ప్రారంభించడానికి వచ్చిన అధికారులు.. రిబ్బన్ కత్తిరించడానికి కత్తెర తీయగానే.. ఆ బ్రిడ్జి కాస్తా కృంగి పోయింది. భద్రతా సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మహిళను పడిపోతున్న వంతెనపై నుంచి తీసుకెళ్లారు. అధికారిక ప్రతినిధి బృందంలోని మిగిలిన సభ్యులు పక్కకు దూకేశారు. మరికొందరు వంతెనపై చిక్కుకుపోయిన అధికారులకు సహాయం చేయడానికి పరుగెత్తడం కనిపిస్తుంది. ఐహరారే ప్రకారం, ఈ సంఘటన గత వారం జరిగింది. వంతెన కూలిపోయి రెండు ముక్కలైంది.


Next Story