బ్రిటన్ లో కుప్పకూలిన బోరిస్ జాన్సన్ ప్రభుత్వం
Boris Johnson Announces Resignation As UK PM. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేశారు.
By Medi Samrat Published on 7 July 2022 6:35 PM ISTబ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన మంత్రి వర్గంలోని 54మంది రాజీనామా చేయడంతో బోరిస్ పై ఒత్తిడి పెరిగింది. గురువారం ప్రధాని పదవికి రాజీనామా చేసినట్లు యూకే మీడియా తెలిపింది. ప్రభుత్వంపై వస్తున్న పలు అవినీతి ఆరోపణలు, ఇతర కుంభకోణాలపై బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలోకి పలువురు మంత్రుల్లో తీవ్ర నిరసన నెలకొంది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీకి పార్టీలో, ప్రభుత్వంలో కీలక పదవిని అప్పగించడంతో ఆగ్రహం మరింత పెరిగింది. ఈ కుంభకోణాలకు నిరసనగా రాజీనామా చేస్తున్నామని రిషి సునక్, సాజిద్ జావిద్ తమ రాజీనామా లేఖల్లో తెలిపారు.
జాన్సన్ మంత్రివర్గం నుంచి శిశు, కుటుంబ వ్యవహారాల మంత్రి విల్ క్విన్స్, రవాణా శాఖ సహాయ మంత్రి లారా ట్రాట్ కూడా వైదొలగారు. రాజీనామా చేయడం మినహా మరో ప్రత్యామ్యాయం లేదని తన రాజీనామా లేఖలో విల్‌క్విన్స్ వెల్లడించారు. ప్రభుత్వం ప్రజా విశ్వాసం కోల్పోయిందని లారా విమర్శించారు. ఈ నలుగురే కాకుండా, బోరిస్ జాన్సన్ టీమ్ నుంచి దాదాపు 10 మంది వరకు సహాయ మంత్రులు, ఇతర కీలక శాఖల బాధ్యులు వైదలగారు. ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించడంపై బోరిస్ జాన్సన్ క్షమాపణలు చెప్పారు. ఆ నియామకాన్ని రద్దు చేసిన జాన్సన్, బేషరతుగా క్షమాపణలు కూడా చెప్పారు.