కోర్టుకు హాజరైన నవీద్ అక్రమ్

బోండి బీచ్ కాల్పుల కేసులో ప్రాణాలతో బయటపడిన తీవ్రవాది నవీద్ అక్రమ్ తొలిసారి కోర్టు ముందు హాజరయ్యాడు.

By -  Medi Samrat
Published on : 16 Feb 2026 3:33 PM IST

కోర్టుకు హాజరైన నవీద్ అక్రమ్

బోండి బీచ్ కాల్పుల కేసులో ప్రాణాలతో బయటపడిన తీవ్రవాది నవీద్ అక్రమ్ తొలిసారి కోర్టు ముందు హాజరయ్యాడు. డిసెంబర్ 14న ఆస్ట్రేలియాలో జరిగిన అత్యంత దారుణమైన ఉగ్రవాద దాడుల్లో 15 మంది మృతి చెందారు. కాల్పులు జరిపిన నవీద్ ను పట్టుకున్నారు అధికారులు. దశాబ్దాల క్రితం హైదరాబాద్ నుండి వలస వచ్చిన సాజిద్ పోలీసులు కాల్పులు జరపడంతో మరణించాడు. బుల్లెట్ గాయాలకు గురైన నవీద్ చికిత్స పొందాడు.

ABC న్యూస్ ప్రకారం, నవీద్ పై 59 అభియోగాలు ఉన్నాయి. వాటిలో 15 హత్య అభియోగాలు. ఉగ్రవాద దాడికి పాల్పడటం ఉంది. కోర్టులో పెద్దగా నవీద్ మాట్లాడలేదని అధికారులు తెలిపారు. నవీద్ కరం గౌల్బర్న్ సూపర్‌మాక్స్ జైలులో ఖైదు చేయబడ్డాడు.

డిసెంబర్ 14, 2025న ఆస్ట్రేలియాలోని బోండి బీచ్‌లో 24 ఏళ్ల నవీద్ అక్రమ్, అతని తండ్రి 50 ఏళ్ల సాజిద్ అక్రమ్‌తో కలిసి ఘోరమైన కాల్పులకు పాల్పడ్డారు. 15 మందిని చంపగా, 40 మంది గాయపడ్డారు. సాజిద్‌ను పోలీసులు సంఘటనా స్థలంలోనే కాల్చి చంపగా, పోలీసుల కాల్పుల్లో నవీద్ గాయపడ్డాడు. సంఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకున్నారు.

Next Story