అమెరికాలోని ఓ సరస్సులో ఇద్దరు భారతీయ విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. సమాచారం ప్రకారం.. అమెరికాలోని ఇండియానాలోని సరస్సులో ఈతకు వెళ్లి అదృశ్యమైన ఇద్దరు భారతీయ విద్యార్థుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. సిద్ధాంత్ షా (19), ఆర్యన్ వైద్య (20 ఏప్రిల్ 15న ఇండియానాపోలిస్ నగరానికి నైరుతి దిశలో 64 మైళ్ల దూరంలో ఉన్న లేక్ మన్రో కు స్నేహితుల బృందంతో ఈతకు వెళ్లారని యూఎస్ఏ టుడే వార్తాపత్రిక నివేదించింది. ఇద్దరూ ఇండియానా యూనివర్సిటీలోని కెల్లీ స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థులు. ఏప్రిల్ 15 నుంచి కనిపించకుండా పోయాడు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సెర్చ్ ఆపరేషన్‌కు ఆటంకం ఏర్పడిందని.. అయితే భారీ ఆపరేషన్ తర్వాత ఇద్దరి మృతదేహాలను ఏప్రిల్ 18న వెలికితీసినట్లు అధికారులు తెలిపారు.
ఇండియానా డిపార్ట్‌మెంట్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ ప్రకారం.. ఏప్రిల్ 15న సిద్ధాంత్ షా, ఆర్యన్ వైద్య స్నేహితుల బృందంతో కలిసి ఇండియానాపోలిస్ నగరానికి నైరుతి దిశలో 64 మైళ్ల దూరంలో ఉన్న లేక్ మన్రో వద్దకు వెళ్లినట్లు తెలిపింది. ఈత కొడుతూ ఇద్దరూ సరస్సులో మునిగి చనిపోయారు. ఏప్రిల్ 18న పేన్‌టౌన్ మెరీనాకు తూర్పున మృతదేహాలను వెలికితీశారు. బలమైన గాలుల కారణంగా మృతదేహాలను వెలికితీసే కార్యక్రమం ఆలస్యం అయ్యింది.