టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా యుద్ధ రంగంలో కూడా టెక్నాలజీని తెగ వాడేస్తూ ఉన్నారు. మానవ రహిత డ్రోన్ లు ఎంతో ప్రభావవంతంగా పని చేస్తున్నాయి. ఇప్పుడు అదే విధంగా హెలీకాఫ్టర్లను కూడా సిద్ధం చేస్తున్నారు. పైలెట్ లేకుండానే వెళ్లే విమానానికి అమెరికా రాష్ట్రమైన కెంటకీలో నడిపించారు. ఒక బ్లాక్ హాక్ హెలికాప్టర్ పైలట్ లేకుండానే ప్రయాణించింది. ప్రత్యేకంగా తయారు చేసిన ఈ ఛాపర్ 30 నిమిషాల పాటు అనుకరణ నగర దృశ్యంలో ప్రయాణించి, ఖచ్చితమైన ల్యాండింగ్ చేయడానికి ముందు ఊహాజనిత భవనాలను తప్పించింది.
కెంటకీలోని ఆర్మీ అధికారులు పైలెట్ లేకుండా వెళ్లగలిగే అటానమస్ 'బ్లాక్ హాక్' హెలికాప్టర్ ను టెస్ట్ చేశారు. అరగంటపాటు పైలెట్ లేకుండానే ఎగిరింది. సిమ్యులేషన్ పద్ధతిలో ఏర్పాటు చేసిన ఊహాజనిత సిటీలోని బిల్డింగులను దాటేస్తూ ముందుకెళ్లింది. ల్యాండింగ్ కూడా పర్ ఫెక్ట్ గా అయింది. గంటకు 190 కిలోమీటర్ల నుంచి 250 కిలోమీటర్ల వేగంతో 4 వేల అడుగుల ఎత్తులో ఎగిరింది. 'అలియాస్' అనే అమెరికా రక్షణ పరిశోధన కార్యక్రమం కింద ఈ కంప్యూటర్ ఆపరేటెడ్ హెలికాప్టర్ ను రూపొందించారు. పైలట్ ను అందుబాటులో లేని సమయంలో ఈ విమానాలను ఎంతో సులువుగా వాడేయవచ్చు.