ఆగ్నేయ స్పెయిన్‌లోని ముర్సియాలోని నైట్‌క్లబ్‌లో ఆదివారం ఉదయం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఏడుగురు మరణించారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్పెయిన్ అత్యవసర సేవలు హెచ్చరిస్తున్నాయి. భద్రతా సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలంలో సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు.
స్పెయిన్ అత్యవసర సేవల విబాగం సిబ్బంది ఆరుగురు తీవ్రంగా గాయపడినట్లు గుర్తించినట్లు సోషల్ మీడియాలో ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం.. ఉదయం 6:00 గంటలకు.. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది.. సంఘటనా స్థలానికి చేరుకున్నారని చెప్పారు. భద్రతా సిబ్బంది సహాయక చర్యల కోసం భవనంలోకి ప్రవేశించి సహాయక చర్యలు మొదలుపెట్టారు. మృతుల సంఖ్య ఏడుకు చేరిందని సిబ్బంది తెలిపింది.