కొత్త కరోనాకు ఆరు నెలల్లోనే టీకా రానుందట..
BioNTech Says Can Make Mutation-Beating Vaccine In 6 Weeks. కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తూ ఉంది.
By Medi Samrat Published on 22 Dec 2020 6:30 PM IST
కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తూ ఉంది. బ్రిటన్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో ప్రస్తుతం వ్యాప్తిస్తున్న కరోనా వైరస్ కొత్తదని తేలింది. దీంతో ఈ తరహా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో పలు యూరప్ దేశాలు అప్రమత్తయ్యాయి. కరోనా కొత్తరకం వైరస్ సోకిన వ్యక్తుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో లండన్ లో లాక్ డౌన్ విధించారు. ఈ నూతన రకం వైరస్ 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతోందని బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. కొత్త కరోనా పై జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ సంస్థ ఓ శుభవార్త చెప్పింది.
ఫైజర్‌తో కలసి తాము సంయుక్తంగా రూపొందించిన టీకా కొత్త కరోనాకూ చెక్ పెట్టగలదని చెప్పుకొచ్చారు. అవసరమైతే కొత్త వైరస్ కోసం ప్రత్యేక టీకాను కూడా డిజైన్ చేయగలమని తెలిపింది. ఆరు వారాల్లోనే ఈ నయా స్ట్రెయిన్‌కు చెక్ పెట్టేలా టీకాను అందుబాటులోకి తేగలమని ప్రకటించింది. ప్రస్తుతమున్న టీకాతో కొత్త స్ట్రెయిన్‌ను నిలువరించే అవకాశాలు చాలా ఎక్కువని బయోఎన్‌టెక్ చీఫ్ ఉగుర్ సాహిన్ తెలిపారు. ప్రస్తుతమున్న టీకా కొత్త స్ట్రెయిన్‌ను అడ్డుకోగలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
అయితే.. ఎమ్ఆర్‌ఎన్ఏ టెక్నాలజీతో కొత్త కరోనాకు చెక్ పెట్టే టీకా డిజైనింగ్‌ను వెంటనే ప్రారంభించవచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కేవలం ఆరు నెలల్లోనే టీకాను అందుబాటులోకి తేవచ్చని చెబుతూ ఉన్నారు. బ్రిటన్‌లో వైరస్ వచ్చిందన్న వార్త రాగానే ప్రపంచ దేశాలు అలర్టైపోయాయి. యూరప్‌తో పాటూ అనేక దేశాలు బ్రిటన్‌కు విమానయాన సర్వీసులను నిలిపివేశాయి. భారత్ కూడా డిసెంబర్ 31 వరకూ విమానసర్వీసులను నిలిపివేసింది.