బ్రెయిన్ స్కాన్ చేయించుకున్నాక మద్యం వదిలేయాలని ఫిక్స్ అయిన సూపర్ మోడల్

Bella Hadid quits drinking after seeing her brain scan. సూపర్ మోడల్ బెల్లా హదీద్ మళ్లీ మద్యం సేవించనని తాజాగా ప్రమాణం చేసింది.

By Medi Samrat  Published on  24 Jan 2022 4:35 PM IST
బ్రెయిన్ స్కాన్ చేయించుకున్నాక మద్యం వదిలేయాలని ఫిక్స్ అయిన సూపర్ మోడల్

సూపర్ మోడల్ బెల్లా హదీద్ మళ్లీ మద్యం సేవించనని తాజాగా ప్రమాణం చేసింది. బెల్లా తాజా ఇంటర్వ్యూలో తాను మద్యపానం మానేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఆల్కహాల్ తన ఆరోగ్యాన్ని చాలా ప్రభావితం చేసిందని తెలిపింది. బెల్లా మద్యపానాన్ని వదులుకోవాలనే తన నిర్ణయం ఆరు నెలల క్రితమే తీసుకున్నట్లు పంచుకుంది. 25 ఏళ్ల ఆమె మెదడుపై ఆల్కహాల్ ప్రభావాలను వైద్యుడు చూపించిన తర్వాత "గ్లాస్ తీయడానికి చాలా కష్టంగా మారిందని" వెల్లడించింది. బ్రెయిన్ స్కాన్ చేయించుకున్నాక మద్యం వదిలేయాలని ఫిక్స్ అయినట్లు ఆమె స్పష్టం చేసింది.

"నేను ఇప్పటికే మద్యపానంలో తేలియాడాను. నేను ఆల్కహాల్‌ను ఇష్టపడ్డాను. రాత్రులలో చాలా వరకూ తాగుతూనే గడిపాను. ఇప్పుడు నన్ను నేను నియంత్రించుకోలేనని భావించాను." అని తెలిపింది. మద్యపానం ఎంత ప్రభావితం చేస్తుందో తెలుసుకున్నానని ఆమె మీడియాతో పంచుకుంది. స్ట్రెస్ ను తగ్గించడానికి మద్యం తీసుకుంటామని.. అయితే మద్యం వలన కలిగే దుష్పరిణామాలు చాలా ఉన్నాయని ఆమె తెలిపింది. సోషల్ మీడియాలో కోట్లల్లో ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్న బెల్లా హదీద్.. మద్యపానం వదిలేయడంతో పలువురు ఆమెను ప్రశంసిస్తూ ఉన్నారు.

Next Story