ట్రంప్ ప్రమాణస్వీకారానికి ముందు, టిక్‌టాక్‌కు షాక్.. యాపిల్, ప్లేస్టోర్లలో కనిపించని యాప్
తమ దేశంలో టిక్‌టాక్‌పై అమెరికా విధించిన బ్యాన్ అమల్లోకి వచ్చింది. అమెరికా ఫెడరల్ లా విధించిన నిషేధం ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో ఆ యాప్ ఇప్పుడు యాపిల్, గూగుల్ స్టోర్లలో కనిపించడంలేదు.
By Knakam Karthik Published on 19 Jan 2025 12:59 PM ISTట్రంప్ ప్రమాణస్వీకారానికి ముందు, టిక్‌టాక్‌కు షాక్.. యాపిల్, ప్లేస్టోర్లలో కనిపించని యాప్
తమ దేశంలో టిక్‌టాక్‌పై అమెరికా విధించిన బ్యాన్ అమల్లోకి వచ్చింది. అమెరికా ఫెడరల్ లా విధించిన నిషేధం ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో ఆ యాప్ ఇప్పుడు యాపిల్, గూగుల్ స్టోర్లలో కనిపించడంలేదు. టిక్‌టాక్‌ను అమెరికాలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో లేకుండా పోయింది. అలాగే ఇప్పటికే డౌన్‌లోడ్ చేసుకున్న వాళ్లు దానిని వినియోగించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. టిక్‌టాక్‌ను అమెరికా కంపెనీలకు విక్రయించాలని, లేకపోతే నిషేధం విధిస్తామని గతంలోనే ఫెడరల్ లా స్పష్టం చేసింది. దీంతో నిషేధానికి ఒక రోజు ముందే బైట్ డ్యాన్స్ కంపెనీ టిక్ టాక్ సేవలను నిలిపివేసింది.
శనివారం నైట్ నుంచి టిక్ టాక్ యాప్‌ను వాడటానికి ట్రై చేసిన యూజర్లకు టెంపరరీ అన్ అవెయిలబుల్ అనే పాపప్ మెసేజ్ వచ్చినట్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతే కాకుండా అమెరికాలో టిక్ టాక్ ఉపయోగించకుండ చట్టం చేశారు. అందుకే ప్రస్తుతం టిక్ టాక్‌ను ఉపయోగించలేరు. అధ్యక్షుడు ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తమతో కలిసి ఈ సమస్యలను పరిష్కరించడానికి కలిసి పని చేస్తానని చెప్పడం తమ అదృష్టమని ప్లీ స్టే ట్యూన్డ్ అనే మెసేజ్ కనిపించింది.
అయితే చాలా న్యాయ పోరాటాల తర్వాత కూడా టిక్‌టాక్‌పై నిషేధాన్ని అమలు చేయడానికి యూఎస్ సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది. దేశ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఎస్ ఫెడరల్ లా చెబుతోంది. టిక్ టాక్ మాతృ సంస్థ బైట్ డ్యాన్స్.. ఈ యాప్‌ను చైనాకు చెందిన వారికి తప్ప ఎవరికైనా అమ్మాలని, లేకుంటే నిషేధం ఎదుర్కోవాలని వార్నింగ్ ఇచ్చింది. అయితే టిక్ టాక్ పట్ల డొనాల్డ్ ట్రంప్ అనుకూలంగా ఉన్నారు. తన గెలుపులో భాగస్వామ్యులైన యువ ఓటర్లను కలపడానికి టిక్ టాక్ యూజ్ అయిందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత టిక్ టాక్‌కు 90 రోజుల గడువు ఇస్తానని కూడా గతంలో మాట్లాడారు.
కాగా బైట్ డ్యాన్స్ సీఈవో షౌ చ్యూ నిషేధం ఎత్తివేతకు మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ విషయంలో ఆయన ట్రంప్ హెల్ప్ తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సోమవారం జరుగనున్న ట్రంప్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి కూడా షౌ చ్యూ పాల్గొనే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ ఆమోదించిన ఈ నిషేధిత చట్టాన్ని తొలగించడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు.