పాకిస్థాన్ లోని ఒక పోలీస్ స్టేషన్ ను తాలిబన్ తీవ్రవాదులు ఆక్రమించారు. ఖైబర్ ఫక్తూంఖ్వాలోని పోలీస్ స్టేషన్ ను తాలిబన్లు ఆక్రమించినట్టు పాకిస్థాన్ లోని ప్రధాన వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది. బన్ను కంటోన్మెంట్ పరిధిలోని పోలీస్ స్టేషన్ ను తెహ్రీక్ ఇ తాలిబన్లు ఆక్రమించుకున్నారు. అక్కడ బందీలుగా ఉన్న ఆ సంస్థ ఉగ్రవాదులను తీసుకెళ్లారు.
40 గంటల సుదీర్ఘ ప్రతిష్టంభన తర్వాత, పాకిస్థాన్ ఆర్మీకి చెందిన ప్రత్యేక బలగాలు మంగళవారం మొత్తం 33 మంది మిలిటెంట్లను హతమార్చాయని వార్తా సంస్థ AFP నివేదించింది. ప్రత్యేక బలగాలకు చెందిన ఇద్దరు సిబ్బంది కూడా మరణించినట్లు నివేదిక పేర్కొంది. ప్రత్యేక ఆపరేషన్ 15 నిమిషాల పాటు కొనసాగిందని పాకిస్థాన్ ఆర్మీ అధికారులు తెలిపారు. ప్రాణనష్టానికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తీవ్రవాదులకు సంబంధించి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియో సందేశంలో తీవ్రవాదులు తమను విమానంలో ఆఫ్ఘనిస్తాన్‌కు తరలించాలని డిమాండ్ చేశారు. తమను సురక్షితంగా వెళ్లడానికి ఏర్పాట్లు చేయకపోతే బందీలుగా ఉన్న అధికారులను చంపేస్తామని బెదిరించారు.