కరోనా వైరస్ ప్రభావం తగ్గుతూ ఉండడంతో పలు దేశాలలో క్వారెంటైన్ నిబంధనలు సడలిస్తూ వస్తున్నారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా క్వారెంటైన్ నిబంధనలను తాజాగా సడలించింది. బంగ్లాదేశ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీస్ (DGHS) దేశంలో ప్రస్తుత ఇన్ఫెక్షన్ రేటు దృష్ట్యా క్వారెంటైన్ కాలాన్ని 14 రోజుల నుండి 10 రోజులకు తగ్గించినట్లు ది డైలీ స్టార్ మీడియా సంస్థ నివేదించింది. DGHS ప్రతినిధి ప్రొఫెసర్ డాక్టర్ నజ్ముల్ ఇస్లాం జనవరి 30 న కరోనావైరస్ పరిస్థితిపై మాట్లాడుతూ క్వారెంటైన్ సమయాన్ని 10 రోజులకు తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
కరోనా పరీక్షలో పాజిటివ్ అని తేలితే.. 10-రోజుల పాటూ ఐసోలేషన్ లో ఉండాలని కోరాము. జ్వరం, ఇతర లక్షణాలు తగ్గిన తర్వాత.. కరోనా సోకిన వ్యక్తి 10 రోజుల తర్వాత తిరిగి పనికి వెళ్లవచ్చని అన్నారు. గతంలో, RT PCR సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి (మళ్లీ పనిలో చేరడానికి కార్యాలయం), కానీ ఇప్పుడు ఆ నిబంధనలను సడలించామని డాక్టర్ నజ్ముల్ చెప్పారు. "ఎవరికైనా జ్వరంతో పాటు మూర్ఛ, బొంగురు గొంతు ఉంటే, ఆ వ్యక్తి తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలని" అని తెలిపారు.