ఇస్కాన్ ను నిషేధించలేము

బాంగ్లాదేశ్ లో ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్)ను నిషేధించాలంటూ బంగ్లాదేశ్ హైకోర్టు గురువారం సుమోటో ఆర్డర్‌ను ఆమోదించడానికి నిరాకరించింది.

By Medi Samrat  Published on  28 Nov 2024 5:15 PM IST
ఇస్కాన్ ను నిషేధించలేము

బాంగ్లాదేశ్ లో ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్)ను నిషేధించాలంటూ బంగ్లాదేశ్ హైకోర్టు గురువారం సుమోటో ఆర్డర్‌ను ఆమోదించడానికి నిరాకరించింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇస్కాన్‌ను నిషేధించాలని రిట్ పిటిషన్ దాఖలు చేసిన ఒక రోజు తర్వాత కోర్టు తిరస్కరణకు గురైంది, ఇస్కాన్ సన్యాసి చిన్మోయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారిని ఢాకాలో అరెస్టు చేయడం వల్ల దేశవ్యాప్తంగా హింస చెలరేగింది. ఇస్కాన్ ను మత ఛాందసవాద సంస్థ అని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆరోపిస్తోంది.

దేశంలో ఇస్కాన్‌ కార్యకలాపాలపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నదీ, అటార్నీ జనరల్‌కు నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇస్కాన్‌ సంస్థ తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ, పది సభ్యుల సుప్రీం కోర్టు న్యాయమూర్తుల బృందం బంగ్లాదేశ్‌ ప్రభుత్వానికి లీగల్‌ నోటీసు జారీ చేసింది. గత కొన్ని రోజులుగా దేశంలో ఇస్కాన్​ వల్ల అల్లర్లు జరుగుతున్నాయని బంగ్లాదేశ్ ప్రభుత్వం చెబుతోంది. సనాతన్‌‌ జాగరణ్‌‌ మంచ్‌‌ ప్రతినిధి, ఇస్కాన్​ సంస్థకు చెందిన చిన్మయ్​ కృష్ణదాస్ బ్రహ్మచారి బెయిల్​ నిరాకరణ తర్వాత చెలరేగిన ఘర్షణల్లో లాయర్ మృతి చెందగా అందుకు ఇస్కాన్ సభ్యులే కారణమని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆరోపిస్తోంది.

Next Story