ఫిలిప్పీన్స్‌లో తుపాను బీభత్సం.. 75 మంది మృతి.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌

At Least 75 Dead In Philippines Super Typhoon. ఫిలీప్పీన్స్‌లో రాయ్‌ టైఫూన్‌ బీభత్సం సృష్టించింది. ఈ తీవ్రమైన తుపాను కారణంగా ఇప్పటి వరకు 75 మంది మరణించారు.

By అంజి  Published on  19 Dec 2021 3:26 AM GMT
ఫిలిప్పీన్స్‌లో తుపాను బీభత్సం.. 75 మంది మృతి.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌

ఫిలీప్పీన్స్‌లో రాయ్‌ టైఫూన్‌ బీభత్సం సృష్టించింది. ఈ తీవ్రమైన తుపాను కారణంగా ఇప్పటి వరకు 75 మంది మరణించారు. తుపాను ధాటికి ఫిలిప్పీన్స్‌ ద్వీపాలు ధ్వంసమయ్యాయి. కాగా అక్కడి ప్రజలకు నీరు, ఆహారాన్ని పంపిణీ చేసే ప్రయత్నాలను అధికారులు ముమ్మరం చేశారు. దక్షిణ, మధ్య ప్రాంతాలను తుపాను ధ్వంసం చేయడంతో 3,00,000 కంటే ఎక్కువ మంది ప్రజలు తమ ఇళ్లను, బీచ్ ఫ్రంట్ రిసార్ట్‌లను వదిలి పారిపోయారు. తుపాను కారణంగా అనేక ప్రాంతాల్లో కమ్యూనికేషన్లు, విద్యుత్తు వ్యవస్థ దెబ్బతింది. ఇళ్ల పైకప్పులు కూలిపోయాయి.

ప్రముఖ పర్యాటక కేంద్రమైన బోహోల్ గవర్నర్ ఆర్థర్ యాప్ తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో.. విధ్వంసానికి గురైన ద్వీపంలోని మేయర్లు తమ పట్టణాల్లో 49 మంది మరణించినట్లు తెలిపారు. తాజా అధికారిక గణాంకాల ప్రకారం మొత్తం మరణాల సంఖ్య 75కి చేరుకుంది. గంటకు 195 కిలోమీటర్లు (120 మైళ్లు) వేగంతో వీచిన సూపర్ టైఫూన్ కారణంగా తుఫాను గురువారం దేశంలోకి దూసుకెళ్లడంతో ద్వీపంలో ఇంకా 10 మంది తప్పిపోయారని మరియు 13 మంది గాయపడ్డారని యాప్ చెప్పారు. "కమ్యూనికేషన్‌ సరిగా లేదు. 48 మందిలో 21 మంది మేయర్‌లు మాత్రమే మా వద్దకు చేరుకున్నారు." అని యాప్ చెప్పారు.

వరదల బారిన పడిన ప్రావిన్స్‌లో మరణాల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా తుపాను అత్యంత ప్రభావిత ప్రాంతాలలో రెస్క్యూ కొనసాగుతోంది. వేలాది మంది మిలిటరీ, పోలీసు, కోస్ట్ గార్డ్ మరియు అగ్నిమాపక సిబ్బందిని సహాయక కార్యక్రమాలు చేపట్టారు. పడిపోయిన విద్యుత్ స్తంభాలు, చెట్ల ద్వారా బ్లాక్ చేయబడిన రోడ్లను క్లియర్ చేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, అత్యవసర సేవలు విరాళాల కోసం విజ్ఞప్తి చేశాయి.

Next Story