పాక్‌లో బాంబు పేలుడు.. 30 మంది మృతి

At least 30 killed in bomb explosion at Peshawar mosque. పాకిస్థాన్ మ‌రోమారు బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. వాయువ్య పాకిస్థాన్‌లోని పెషావర్ నగరంలో

By Medi Samrat  Published on  4 March 2022 10:29 AM GMT
పాక్‌లో బాంబు పేలుడు.. 30 మంది మృతి

పాకిస్థాన్ మ‌రోమారు బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. వాయువ్య పాకిస్థాన్‌లోని పెషావర్ నగరంలో శుక్రవారం న‌మాజ్‌ సందర్భంగా రద్దీగా ఉన్న ఓ మసీదులో బాంబు పేలడంతో కనీసం 30 మంది మరణించారు. మ‌రో 50 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. పెషావర్‌లోని కిస్సా ఖ్వానీ బజార్ ప్రాంతంలోని జామియా మసీదులో భక్తులు శుక్రవారం ప్రార్థనలు చేస్తున్న సమయంలో పేలుడు సంభవించిందని రెస్క్యూ అధికారి తెలిపారు.

ఇప్పటివరకు 30 మృతదేహాలను ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్ల‌డించారు. ఇద్దరు దుండగులు మసీదులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారని, కాపలాగా నిలబడిన పోలీసులపై కాల్పులు జరిపారని పోలీసు అధికారి పెషావర్ ఇజాజ్ అహ్సన్ తెలిపారు. ఈ ఘటనలో ఒక పోలీసు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. కాల్పుల ఘటన తర్వాత పేలుడు సంభవించిందని ఆయన తెలిపారు.


Next Story