కరాచీలో భారీ పేలుడు.. 12 మంది మృతి

At least 12 killed in Karachi blast. కరాచీలోని పరాచా చౌక్ ప్రాంతంలో గ్యాస్ పైప్‌లైన్‌లో శక్తివంతమైన పేలుడు సంభవించింది.

By Medi Samrat  Published on  18 Dec 2021 11:31 AM GMT
కరాచీలో భారీ పేలుడు.. 12 మంది మృతి

కరాచీలోని పరాచా చౌక్ ప్రాంతంలో గ్యాస్ పైప్‌లైన్‌లో శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఘ‌ట‌న‌లో కనీసం 12 మంది మరణించగా.. అనేక మంది గాయపడ్డారు. షహీద్ మొహతర్మా బెనజీర్ భుట్టో హాస్పిటల్ ట్రామా సెంటర్ చీఫ్ డాక్టర్ సబీర్ మెమన్ మరణించిన వారి సంఖ్యను ధృవీకరించారు. అలాగే.. గాయపడిన 11 మంది సుప‌త్రిలో చికిత్స పొందుతున్నారని.. వారందరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఘ‌ట‌నాస్థ‌లంలో ఎనిమిది మృతదేహాలు లభించ‌గా.. గాయపడిన నలుగురు చికిత్స పొందుతూ మరణించారని ఆయన చెప్పారు. ఆసుపత్రికి తీసుకువచ్చిన వారిలో చాలా మందికి తీవ్ర‌ గాయాలు ఉన్నాయని ఆసుపత్రి అధికారులు తెలిపిన‌ట్లు స్థానిక‌ వార్త‌సంస్థ‌లు పేర్కోన్నాయి. పేలుడు ధాటికి ఒక ప్రైవేట్ బ్యాంక్ భవనం, అక్కడ పార్క్ చేసిన అనేక కార్లు దెబ్బతిన్నాయని కరాచీ పోలీసు ప్రతినిధి ధృవీకరించారు.

బాంబు డిస్పోజల్ యూనిట్ (BDU) పేలుడు జరిగిన ప్రదేశానికి చేరుకుంది. రెస్క్యూ సర్వీసెస్ సిబ్బంది, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని కరాచీలోని ట్రామా సెంటర్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. మధ్యాహ్నం 1:50 గంటలకు పేలుడు సంభవించిందని పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుండటంతో ఆ ప్రాంతాన్ని పోలీసు సిబ్బంది చుట్టుముట్టాయి. ఇదిలావుంటే.. భవనం శిథిలాల కింద చాలా మంది సమాధి అయ్యుంటార‌ని ప్రత్యక్ష సాక్షులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. శిథిలాలను తొలగించి అక్కడ చిక్కుకున్న వారిని రక్షించేందుకు అధికారులు భారీ యంత్రాంగాన్ని రప్పించారు.


Next Story