బుర్కినా ఫాసోలో ఉగ్రవాదుల కాల్పుల కలకలం.. 19 మంది మృతి

At least 10 civilians, 9 gendarmes killed in attack in Burkina Faso. పశ్చిమ ఆఫ్రికాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బుర్కినా ఫాసోలోని ఆర్మీ ఫోర్స్‌ను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డారు.

By అంజి  Published on  24 Nov 2021 7:54 AM GMT
బుర్కినా ఫాసోలో ఉగ్రవాదుల కాల్పుల కలకలం.. 19 మంది మృతి

పశ్చిమ ఆఫ్రికాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బుర్కినా ఫాసోలోని ఆర్మీ ఫోర్స్‌ను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 9 మంది సైనికులు, 10 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆర్మీ ఫోర్స్‌ వెంటనే సహాయక చర్యలు చేపట్టింది. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. తీవ్రంగా గాయపడ్డ వారిని చికిత్స కోసం స్థానికంగా ఉన్న ఆస్పత్రులకు తరలించారు. ఉగ్ర దాడి జరిగినట్లు సమాచార శాఖ మంత్రి, ప్రభుత్వ అధికార ప్రతినిధి ఉస్సేని తంబోరా ధృవీకరించారు. రక్షణ శాఖ మంత్రి మ్యాక్సిం కోనే జాతీయ రేడియోలో ఈ విషయాన్ని వెల్లడించారు.

ఆదివారం నుండి సోమవారం రాత్రి వరకు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. నవంబరు 22న మిలిటరీ డిటాచ్‌మెంట్‌పై సాయుధ దుండగులు మెరుపుదాడి చేశారని అధికారులు ధృవీకరించారు. కనీసం ఎనిమిది మంది భద్రతా సిబ్బంది ఆచూకీ తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఈ దాడికి తామే బాధ్యులమని ఏ గ్రూపు వెంటనే ప్రకటించుకోలేదు. తప్పిపోయిన సైనికులను గుర్తించేందుకు అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే ఇలాంటి దాడులను నిరోధించడానికి అదనపు గస్తీని నిర్వహిస్తున్నారు.

ఈ దాడి బుర్కినా ఫాసోలో చాలా వరకు అభద్రత, తీవ్రవాద దాడుల ప్రమాదాన్ని నొక్కి చెబుతోంది. నవంబర్ 14న సౌమ్ ప్రావిన్స్‌లోని ఇనాటా బంగారు గని సమీపంలో సాయుధ దాడి జరిగింది, 57 మంది వరకు మరణించారు. ట్రై-సరిహద్దు ప్రాంతంలో (నైజర్, మాలి, బుర్కినా ఫాసోల భాగస్వామ్య సరిహద్దుల సమీపంలో) పనిచేస్తున్న ఇస్లామిస్ట్ మిలిటెంట్లు ఇలాంటి దాడులకు పాల్పడుతుంటారని తెలుస్తోంది.

Next Story