ఉద్రిక్తత: సూడాన్‌లో ప్రభుత్వంపై సైన్యం తిరుగుబాటు..!
Army coup against Sudan government. సూడాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వంపై అక్కడి ఆర్మీ తిరుగుబాటు చేసింది. టెంపరరీ ప్రైమ్ మినిస్టర్
By అంజి Published on 26 Oct 2021 5:58 AM GMTసూడాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వంపై అక్కడి ఆర్మీ తిరుగుబాటు చేసింది. టెంపరరీ ప్రైమ్ మినిస్టర్ అబ్దుల్లాతో పాటు మరికొంత మంది అధికారులను రహస్యంగా నిర్బంధించారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే అత్యవసరం అత్యయిక పరిస్థితిని విధిస్తున్నట్లు ఆర్మీ జనరల్ అబ్దెల్ ఫతాహ్ బుర్హాన్ ప్రకటించారు. ప్రధాని నేతృత్వంలోని ప్రభుత్వాన్ని, అధికార మండలిని రద్దు చేశారు. జూలై 2023లో ఎన్నికలు నిర్వహిస్తామని, ఆపై ఎన్నికపై పార ప్రభుత్వానికి పాలన అప్పగిస్తామని బుర్హాన్ హామీ ఇచ్చారు. సైనిక తిరుగుబాటుతో సూడాన్ దేశ ప్రజలు పెద్ద నిరసనగా దిగారు. దీంతో వారిని అదుపు చేసేందుకు సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. నిరసన ఘర్షణల్లో ఏడుగురు చనిపోగా, 140 మంది పౌరులకు గాయాలయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
రెండు సంవత్సరాల కిందటే ఒమర్ అల్ బషీర్ సుదీర్ఘ పాలన నుంచి సూడాన్ దేశం బయటపడింది. కాగా ఇప్పుడిప్పుడే ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేస్తున్న సూడాన్ దేశంలో.. సైనిక తిరుగుబాటు ప్రతికూలంగా మారింది. ఇటీవల ప్రభుత్వంపై ఆర్మీ తిరుగుబాటు చేసి విఫలమైంది. సెప్టెంబర్ నెల నుంచి సూడాన్‌లో రాజకీయ నాయకులు, మిలిటరీ అధికారులు మధ్య పరిస్థితులు మారిపోయాయి. దీంతో ప్రభుత్వంపై ఆర్మీ తిరుగుబాటు చేసింది. దీని పూర్తిగా ఖండించిన ప్రజాస్వామ్య పార్టీలు.. ఆర్మీ తిరుగుబాటుకు వ్యతిరేకంగా నిరసనలు ప్రజలకు పిలుపునిచ్చాయి. అమ్‌డుర్మన్, ఖార్టూమ్ నగరాల్లోని ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు సైన్యం కాల్పులు జరిగింది. సూడాన్‌లో సైనిక తిరుగుబాటుపై అమెరికా, యూఎన్‌వో ఆందోళన వ్యక్తం చేశాయి. ఆర్మీ తిరుగుబాటు నేపథ్యంలో సూడాన్‌కు 700 మిలియన డాలర్ల ఆర్థిక సాయాన్ని నిలిపివేసింది. రహస్య నిర్బంధంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్, అధికారులు తక్షణం విడుదల చేయాలని వైట్‌హౌస్ ప్రతినిధి కరీన్ జీన్ పియర్ అన్నారు.