రష్యా-భారత్ రక్షణ సహకారంలో మరో కీలక పరిణామం
రష్యా – భారత్ రక్షణ సహకారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
By - Knakam Karthik |
రష్యా-భారత్ రక్షణ సహకారంలో మరో కీలక పరిణామం
రష్యా – భారత్ రక్షణ సహకారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత వైమానిక దళం (IAF) కోసం అదనంగా ఐదు S-400 ఎయిర్ డిఫెన్స్ స్క్వాడ్రన్ల కొనుగోలు మరియు వాటి లోకల్ తయారీపై రెండు దేశాలు చర్చలు జరుపుతున్నాయి. సమాచారం ప్రకారం, ఈ చర్చలలో భాగంగా రష్యా కొన్ని టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ (Technology Transfer) అంశాలను భారత్‌కు అందించే దిశగా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, భారత ప్రైవేట్ రంగ సంస్థలు కూడా ఈ తయారీ ప్రక్రియలో భాగం కావచ్చని సూచనలున్నాయి.
ప్రస్తుతం భారత్ 2018లో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఐదు S-400 స్క్వాడ్రన్లలో మూడింటిని ఇప్పటికే అందుకుంది. మిగిలిన రెండింటిని రష్యా 2026–27 నాటికి అందజేయనుంది. అదనపు స్క్వాడ్రన్లపై చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో, కొన్నింటిని పూర్తిగా కొనుగోలు చేయడం, మరికొన్నింటిని భారతదేశంలో తయారు చేయడం అనే మోడల్‌పై పరిశీలన జరుగుతోంది. అదే సమయంలో, భారత్-రష్యా సంయుక్త భాగస్వామ్యంగా (Joint Venture) S-400 వ్యవస్థల రిపేర్, మెయింటెనెన్స్, భాగాల తయారీ కోసం కూడా ఒప్పందం తుదిదశలో ఉందని రష్యా వర్గాలు తెలిపాయి. అయితే, రష్యా నుండి పూర్తి స్థాయి టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌కు అధికారిక అనుమతి (Greenlight) ఇంకా లభించలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.