ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చనో, లేక డెడ్ లైన్ దగ్గరకు వచ్చిందనో.. ఓవర్ టైమ్ చేస్తూ ఉంటాం. కానీ అతిగా పని చేయడం కూడా ప్రాణాలను తీస్తుంది. మితిమీరి ఓవర్‌టైమ్ చేసిన మరొక చైనీస్ టెక్ వర్కర్ చనిపోయాడు. ఓవర్ టైమ్ వర్క్ కల్చర్ చైనాలో ప్రాణాలు తీస్తోంది. ఉద్యోగికి ఎక్కువ పని ఇవ్వడంతో.. ఉద్యోగుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 25 ఏళ్ల వ్యక్తి ఓవర్ టైమ్ చేస్తూ వస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం తన ఇంటి నుండి ఆసుపత్రికి తరలించిన వెంటనే ఆసుపత్రిలో ప్రాణాలు వదిలాడు. వీడియో ప్లాట్‌ఫారమ్ లో బిలిబిలి అనే ఆ వ్యక్తి కంటెంట్ ఆడిటర్‌గా పనిచేస్తున్నాడు.
బిలిబిలి మెదడులో రక్తస్రావం కారణంగా చనిపోయినట్లు నివేదించారు. ఆ వ్యక్తి ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పనిచేసినట్లు తెలుస్తోంది. గత వారం రోజులుగా, ఓవర్ టైం పని చేస్తూనే ఉన్నాడని తెలిపింది. చైనా టెక్ పరిశ్రమలో ఉద్యోగులు వారానికి ఆరు రోజులు ఉదయం 9 నుండి రాత్రి 9 గంటల వరకు పని చేస్తున్నారు. దీన్నే 996 కల్చర్ అంటున్నారు. ఇలా చేయడం వలన తీవ్ర ఒత్తిడిని ఉద్యోగులు ఎదుర్కొంటూ ఉన్నారు. అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మాతో సహా ఉన్నత స్థాయి వ్యక్తులచే దీనిపై గతంలో ప్రచారం చేయబడింది. అధిక పనితో ముడిపడి ఉన్న ఎన్నో మరణాలు ఇటీవల చైనాలో చోటు చేసుకుంటూ ఉన్నాయి.