రోడ్డు మీద పడిపోయిన వ్యక్తి.. ఎవరు ఎలా కాపాడారంటే..

An Apple Watch saved a Singapore motorcyclist's life. Here’s how. రోడ్డు మీద పడిపోయిన వ్యక్తిని స్మార్ట్ వాచ్ కాపాడిన ఘటన సింగపూర్ లో

By Medi Samrat  Published on  1 Oct 2021 12:13 PM GMT
రోడ్డు మీద పడిపోయిన వ్యక్తి.. ఎవరు ఎలా కాపాడారంటే..

రోడ్డు మీద పడిపోయిన వ్యక్తిని స్మార్ట్ వాచ్ కాపాడిన ఘటన సింగపూర్ లో చోటు చేసుకుంది.సెప్టెంబర్‌ 25న సింగపూర్‌లో రాత్రి వేళ బైక్‌పై వెళ్తున్న మహమ్మద్ ఫిత్రిని ఒక వ్యాన్‌ ఢీకొట్టింది. రోడ్డుపై పడిన అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం తర్వాత అతడు స్పృహ కోల్పోయాడు. రాత్రి సమయంలో అతడ్ని కాపాడేందుకు ఎవరూ సమీపంలో లేరు. ఫిత్రి చేతికి ఉన్న ఆపిల్ వాచ్ ఆటోమేటిక్‌గా ఎమర్జెన్సీ సర్వీస్‌కు ఫోన్‌ చేసింది. అంతేకాకుండా లోకేషన్‌ను కూడా షేర్‌ చేసింది. సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ సిబ్బంది స్పందించారు. శనివారం రాత్రి 8.20కి ప్రమాదం గురించి తమకు అలెర్ట్‌ వచ్చిందని, వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి ప్రమాదంలో గాయడిపన అతడ్ని ఆసుపత్రికి తరలించినట్లు సంబంధిత అధికారి తెలిపారు. అదృష్టవశాత్తు అతడు ధరించిన స్మార్ట్‌ వాచ్‌లో చార్జ్‌ ఉండటంతో దాని అలెర్ట్‌ వల్ల అతడు ప్రాణాలతో బయటపడినట్లు అతడి స్నేహితులు తెలిపారు.

అతడి ఆపిల్‌ స్మార్ట్‌ వాచ్‌ నుంచి తనకు కూడా అలెర్ట్‌ వచ్చినట్లు వెల్లడించింది. మహమ్మద్ ఫిత్రి రోడ్డు ప్రమాదానికి గురై కిందపడటంతో హార్డ్ ఫాల్‌ను గుర్తించే ఆపిల్ వాచ్ ఫీచర్ యాక్టివేట్ అయ్యిందని దీంతో అతడికి సహాయం కోసం ఒక SOS సందేశాన్ని అది పంపించిందట. ఒక వ్యక్తి స్పృహలో ఉన్నాడా లేడా, కదులుతున్నాడా లేదా అని కూడా ఈ స్మార్ట్ వాచ్ ఫీచర్ తనిఖీ చేస్తుందట.. వ్యక్తిలో కదలిక లేదా స్పృహలో లేకపోతే ఆ స్మార్ట్‌వాచ్‌లో ముందుగా సెట్‌ చేసిన అత్యవసర సర్వీస్‌ నంబర్‌, ఇతర నంబర్లకు ఆటోమేటిక్‌గా డయల్ చేస్తుంది. గతంలో యాపిల్ స్మార్ట్ వాచ్ పలువురిని కాపాడిన ఘటనలు చోటు చేసుకున్నాయి.


Next Story