ట్రంప్ కీలక నిర్ణయం, టారిఫ్‌లకు తాత్కాలిక బ్రేక్..చైనాకు మాత్రం నో రిలీఫ్

అంతర్జాతీయ మార్కెట్‌లో ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో అగ్ర రాజ్యం అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది

By Knakam Karthik
Published on : 10 April 2025 7:59 AM IST

International News, Donald Trump, China, US, tariff War, Pause 90 Days

ట్రంప్ కీలక నిర్ణయం, టారిఫ్‌లకు తాత్కాలిక బ్రేక్..చైనాకు మాత్రం నో రిలీఫ్

అంతర్జాతీయ మార్కెట్‌లో ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో అగ్ర రాజ్యం అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన ప్రతీకార సుంకాలపై నిర్ణయాన్ని బ్యాక్ స్టెప్ తీసుకున్నారు. ఇటీవల పలు దేశాలపై విధించిన సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. అయితే ఈ నిర్ణయం చైనాకు వర్తించదని పేర్కొంది. అంతేకాకుండా చైనాపై సుంకాలను 104 నుంచి 125 శాతానికి పెంచుతున్నట్లు వెల్లడించింది. చైనాపై మాత్రం వెంటనే పెంచిన సుంకాలు అమల్లోకి రాగా.. తాజా సవరింపులతో డ్రాగన్‌పై ప్రతీకార సుంకాలు గరిష్టంగా 125 శాతానికి చేరడం గమనార్హం. మరోవైపు అమెరికాపై చైనా సుంకాలు 84 శాతానికి పెరిగాయి. ఇవి గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి.

కాగా, భారత్‌ సహా అనేక దేశాలు తమ వస్తూత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తూ తమ ఆర్థిక వ్యవస్థను కొల్లగొడుతున్నాయని ట్రంప్‌ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే అన్ని దేశాలు తమ వస్తువులపై సుంకాలు తగ్గించాలని గత కొన్ని రోజులుగా చేస్తున్న విజ్ఞప్తులను ట్రంప్‌ ఎట్టకేలకు పరిగణనలోకి తీసుకున్నారు. అయితే చైనాకు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. గత మార్చి వరకు చైనా వస్తువులపై అమెరికా 10 శాతం సుంకాన్ని విధించింది. ఇటీవల పెంచిన పన్నుతో ఇది 54 శాతానికి చేరుకున్నది. ఆపై మరో 50 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం మరో 21 శాతం బాదారు. దీంతో 125 శాతానికి చేరింది. దీనికి ప్రతీకారంగా చైనా సైతం అమెరికా వస్తువులపై 84 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. అందుకు తీవ్రంగా స్పందించిన అమెరికా డ్రాగన్‌పై సుంకాలు 125శాతానికి పెంచుతున్నట్లు వెల్లడించింది.

Next Story