షాకుల మీద షాకులు.. ఇస్తూనే ఉంటామని చెబుతున్న అమెజాన్

Amazon eyes further job cuts into next year amid 'challenging' economy. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తమ సంస్థలో భారీగా ఉద్యోగాల కోత పెట్టాలని నిర్ణయిస్తున్న సంగతి తెలిసిందే..

By Medi Samrat  Published on  18 Nov 2022 5:59 PM IST
షాకుల మీద షాకులు.. ఇస్తూనే ఉంటామని చెబుతున్న అమెజాన్

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తమ సంస్థలో భారీగా ఉద్యోగాల కోత పెట్టాలని నిర్ణయిస్తున్న సంగతి తెలిసిందే..! ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా తమ కంపెనీలో పని చేస్తున్న వారిలో దాదాపు 10 వేల మందిని ఉగ్యోగాల నుంచి తొలగిస్తోంది. తొలగింపు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. వేటు ఎదుర్కొంటున్న ప్రతి ఉద్యోగితో మాట్లాడి, కొత్త ఉపాధి మార్గాలను అందించేందుకు సహాయం చేస్తామని కంపెనీ చెబుతోంది. ఈ మేరకు ప్రభావిత ఉద్యోగులకు తొలగింపు గురించి అధికారిక మెయిల్ పంపింది. వేటు ఎదుర్కొంటున్న వాళ్లు అమెజాన్ లో ఇతర విభాగాల్లో ఉద్యోగం సంపాదించుకోవడానికి రెండు నెలల సమయం ఇచ్చింది.

భారీ తొలగింపులు 2023లో కూడా ఉంటాయని చెబుతూ ఉన్నారు. ఎన్నడూ ఈ స్థాయిలో కఠిన నిర్ణయం తీసుకోలేదని.. ముఖ్యంగా ఖర్చులను తగ్గించే అవకాశాల కోసం ప్రత్యేక దృష్టి సారించామని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితులు గతంలో చేపట్టిన భారీ నియామకాల వల్ల ఏర్పడిందని, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తున్నట్టు చెప్పారు. ఆర్థిక మాంద్యం భయాలకు తోడు కంపెనీ ఆదాయాలు భారీగా క్షీణిస్తున్న నేపథ్యంలో అమెజాన్, గత కొన్ని నెలలుగా వివిధ విభాగాల్లో ఖర్చులను తగ్గించే ప్రయత్నాలు చేస్తోంది. కంపెనీ చరిత్రలోనే ఎన్నడూ లేనంత మంది ఉద్యోగులను బయటకు పంపించేస్తోంది.


Next Story