సాధారణంగా కొంత మంది వ్యక్తులు.. వాహనదారులకు తెలియకుండా వెనకాల కూర్చొని ప్రయాణం చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలు ఎక్కువగా గూడ్స్‌ వాహనాల్లో జరుగుతుంటాయి. డ్రైవర్‌ తెలియకుండా వాహనం ఎక్కి.. కొందరు తాము చేరాల్సిన గమ్యం చేరుతారు.. మరికొందరు చిక్కుల్లో పడతారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగింది. అమెజాన్‌ డెలివరీ వాహన డ్రైవర్‌కు తెలియకుండా ఓ అమ్మాయి వ్యాన్‌ ఎక్కి కూర్చుంది. ఆ తర్వాత డెలివరీ చేయడానికి ఓ ఇంటి వద్ద రోడ్డుపై డ్రైవర్‌ వ్యాన్‌ను ఆపాడు. వ్యాన్‌ వెనుక డోర్‌లో అమ్మాయి కూర్చోవడంతో ఆశ్చర్యపోయాడు. వ్యాన్‌ ఆగిన వెంటనే ఆ మహిళ కిందకి దిగి నడుచుకుంటూ వెళ్లింది.

దీనికి సంబంధించిన ఓ వీడియోను నెటిజన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. అది వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. అమెజాన్‌ డెలివరీలో అమ్మాయి, నా డెలివరీ ప్యాకేజీలు ఇందుకు ఆలస్యం అవుతున్నాయా, ఆమె ప్రైమ్‌ ప్లస్‌ మెంబర్‌ షిప్‌ తీసుకుందేమో, అంటూ ఫన్నీగా జోకులు వేసుకుంటున్నారు. ఇంకొందరు అసలు ఆ అమ్మాయి వ్యాన్‌ లోపలికి ఎలా వెళ్లిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటనపై అమెజాన్‌ కంపెనీ ప్రతినిధి స్పందించారు. డెలివరీ టైమ్‌లో తాము జాగ్రత్తలు తీసుకుంటామని, కేవలం కంపెనీ గుర్తింపు ఉన్న వారు మాత్రమే డెలివరీ వాహనాలను డ్రైవ్‌ చేస్తారని తెలిపారు.


అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story