అమెరికాకు చెందిన నాసా పరిశోధనల కోసం తీసుకొచ్చిన 27 కోతులను ఒకే రోజు దారుణంగా చంపేసింది. గతేడాది జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అభం శుభం తెలియని కోతులను ఒకేరోజు దారుణంగా హతమార్చడాన్ని జంతు సంక్షేమ ప్రచారకులు వ్యతిరేకించడమే కాకుండా నాసాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలిఫోర్నియా సిలికాన్ వ్యాలీలోని నాసా యొక్క అమెస్ పరిశోధనా కేంద్రంలో గత ఏడాది ఫిబ్రవరి 2 న మొత్తం 27 ప్రైమేట్లను అడ్మినిస్ట్రేటెడ్ డ్రగ్స్ ద్వారా అనాయాసంగా మార్చిచంపారు.
చనిపోయిన కోతుల్లో కొన్ని వృద్ధాప్యంలో ఉండగా.. 21 కోతులు పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నాయి. ఇవన్నీ కూడా పరిశోధనలకు పనికిరావని డిసైడ్ అయ్యారు నాసా సైంటిస్ట్‌లు. పరిశోధనలకు పనికిరాని పక్షంలో ఆ జంతువులను అభయారణ్యానికి తరలించకుండా దారుణంగా చంపడానికి తీసుకున్న నిర్ణయాన్ని జంతు హక్కుల న్యాయవాదులు, ఇతర హక్కుల సంఘాల ప్రతినిధులు ఖండించారు.
న్యూయార్క్ డెమోక్రాట్ ప్రతినిధి కాథ్లీన్ రైస్.. కోతుల మరణాలకు వివరణ కోరుతూ నాసా నిర్వాహకుడు జిమ్ బ్రిడెన్‌స్టైన్‌కు లేఖ రాశారు. అయితే.. గత సంవత్సరం అనాయాసానికి గురైన కోతులను ఏ సాహసోపేతమైన అంతరిక్ష కార్యకలాపాలలోగానీ, పరిశోధనల కోసంగానీ వినియోగించనట్లుగా తేలింది. బదులుగా వాటిని నాసా, లైఫ్ సోర్స్ బయోమెడికల్ మధ్య ఉమ్మడి సంరక్షణ ఏర్పాట్లలో అమెస్ సదుపాయంలో ఉంచారు.