చనిపోయాడని అనుకున్న అల్‌ఖైదా చీఫ్.. వీడియో రిలీజ్..!

Al Qaeda Leader Al-Zawahiri Rumoured Dead Surfaces In Video On 9/11 Anniversary. చ‌నిపోయాడ‌నుకున్న అల్‌ఖైదా చీఫ్ అయ్‌మాన్ అల్‌-జ‌వ‌హిరి

By Medi Samrat  Published on  12 Sep 2021 11:15 AM GMT
చనిపోయాడని అనుకున్న అల్‌ఖైదా చీఫ్.. వీడియో రిలీజ్..!

చ‌నిపోయాడ‌నుకున్న అల్‌ఖైదా చీఫ్ అయ్‌మాన్ అల్‌-జ‌వ‌హిరి బ‌తికే ఉన్నాడు. తాజాగా 9/11 దాడి జ‌రిగి 20 ఏళ్ల పూర్త‌యిన సంద‌ర్భంగా అత‌డు ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశాడు. యుఎస్‌పై ఘోరమైన ఉగ్రదాడి జరిగిన ఇరవై సంవత్సరాల తరువాత, అల్ ఖైదా నాయకుడు అయ్‌మాన్ అల్‌-జ‌వ‌హిరి బ్రతికే ఉన్నాడని తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు. 9/11 వార్షికోత్సవం సందర్భంగా విడుదల చేసిన వీడియోలో అతడు బాగానే ఉన్నాడు. జిహాదీ గ్రూపుల ఆన్‌లైన్ కార్యకలాపాలను ట్రాక్ చేసే యుఎస్ ఆధారిత SITE ఇంటెలిజెన్స్ గ్రూప్, అల్‌-జ‌వ‌హిరి అనేక సమస్యలపై మాట్లాడినట్లు తెలిపింది. SITE డైరెక్టర్ రీటా కాట్జ్ ఆ వీడియోను ట్వీట్ చేసారు, "అతని మరణం గురించిన పుకార్ల మధ్య, అల్-ఖైదా నాయకుడు అల్‌-జ‌వ‌హిరి ఒక కొత్త 60 నిమిషాల వీడియోలో చూపబడింది, ఈసారి అతను చనిపోలేదని కొన్ని సాక్ష్యాలను అందిస్తోంది " అని తెలిపారు.

అల్‌ఖైదా అధికారిక మీడియా అస్‌-స‌హ‌బ్ ఈ 60 నిమిషాల వీడియోను పోస్ట్ చేసింది. ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా మ‌ట్టుబెట్టిన త‌ర్వాత అల్‌ఖైదా బాధ్య‌త‌లు తీసుకున్న జ‌వ‌హిరి చాలాకాలంగా అండ‌ర్‌గ్రౌండ్‌లోనే ఉన్నాడు. గ‌తేడాది న‌వంబ‌ర్‌లో అత‌డు అనారోగ్యంతో మ‌ర‌ణించిన‌ట్లు కూడా వార్తలు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత అత‌ని నుంచి వీడియో బ‌య‌ట‌కు రావ‌డం ఇదే తొలిసారి. శ‌నివారం విడుద‌లైన ఈ వీడియోలో జ‌వ‌హిరి పూర్తి ఆరోగ్యంతో క‌నిపించాడు. సెప్టెంబ‌ర్ 11 ఉద‌యం నుంచీ కొన్ని టెలిగ్రామ్ చానెళ్ల‌లో ఈ వీడియో వ‌స్తోందంటూ అస్‌-స‌హ‌బ్ ప్రోమోలు న‌డిపించింది. ఆ త‌ర్వాత ఓ టెలిగ్రామ్ చానెల్ ద్వారానే జ‌వ‌హిరి రాసిన 852 పేజీల బుక్‌ను రిలీజ్ చేసింది అల్‌ఖైదా. ఈ 60 నిమిషాల వీడియోలో ఒక్క‌చోట మాత్ర‌మే అత‌డు ఆఫ్ఘ‌నిస్థాన్ గురించి ప్రస్తావించాడు. 20 ఏళ్ల యుద్ధం త‌ర్వాత అమెరికా పూర్తిగా కుంగిపోయి మ‌ళ్లీ ఇంటిదారి ప‌ట్టింద‌ని అన్నాడు.


Next Story