ఉక్రెయిన్ నుంచి స్వ‌దేశం చేరుకున్న 242 మంది భార‌తీయులు

Air India flight carrying Indian students from Ukraine lands in Delhi.ర‌ష్యా, ఉక్రెయిన్ దేశాల మ‌ధ్య ప‌రిస్థితులు రోజు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Feb 2022 6:43 AM GMT
ఉక్రెయిన్ నుంచి స్వ‌దేశం చేరుకున్న 242 మంది భార‌తీయులు

ర‌ష్యా, ఉక్రెయిన్ దేశాల మ‌ధ్య ప‌రిస్థితులు రోజు రోజుకు దిగ‌జారుతున్నాయి. ఇరు దేశాల మ‌ధ్య యుద్ద మేఘాలు క‌మ్ముకుంటున్నాయి. దీంతో ఏ క్ష‌ణానా ఏం జ‌రుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితులు అక్క‌డ నెల‌కొన్నాయి. ఈ క్ర‌మంలో భార‌త ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఉక్రెయిన్‌లోని భార‌తీయుల‌ను సుర‌క్షితంగా స్వ‌దేశానికి తీసుకువ‌చ్చేందుకు వందే భార‌త్ మిష‌న్‌కు కేంద్ర ప్ర‌భుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా 242 మందితో ఎయిర్ ఇండియా ప్ర‌త్యేక‌ విమానం ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి చేరుకుంది. ఈ విష‌యాన్ని కేంద్ర విదేశాంగశాఖ సహాయమంత్రి మురళీధరన్ వెల్లడించారు. అందులో కొందరు ఉద్యోగులు, విద్యార్థులు ఉన్నట్లు ఆయన తెలిపారు.

ఉక్రెయిన్ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న భారతీయులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. "నేను సరిహద్దు ప్రాంతానికి దూరంగా ఉన్నాను కాబట్టి అక్కడ పరిస్థితి సాధారణంగా ఉంది, భారత రాయబార కార్యాలయం జారీ చేసిన సలహా తర్వాత తిరిగి వచ్చాను" అని ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్‌ చదువుతున్న భారతీయ విద్యార్థి క్రిష్ రాజ్ అన్నారు.

ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్‌లోని వివిధ ప్రాంతాల్లో సుమారు 20,000 మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. గురువారం, శ‌నివారం(ఫిబ్ర‌వ‌రి 24, 26 తేదీల్లో) మ‌రో రెండు విమానాలు ఉక్రెయిన్‌కు వెళ్ల‌నున్నాయి.

Next Story