అడల్ట్ స్టార్ సోఫియా లియోన్‌ ఇక లేదు

ప్రఖ్యాత అడల్ట్ స్టార్ సోఫియా లియోన్‌.. కొన్ని రోజుల క్రితం తన నివాసంలో చనిపోయినట్లు కనుగొన్నారు.

By Medi Samrat
Published on : 10 March 2024 8:45 PM IST

అడల్ట్ స్టార్ సోఫియా లియోన్‌ ఇక లేదు

ప్రఖ్యాత అడల్ట్ స్టార్ సోఫియా లియోన్‌.. కొన్ని రోజుల క్రితం తన నివాసంలో చనిపోయినట్లు కనుగొన్నారు. ఆమె మరణంపై అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ సంతాపం తెలిపింది. నివేదికల ప్రకారం, ఆమె కుటుంబం 26 ఏళ్ల సోఫియాను సంప్రదించడానికి ప్రయత్నించినప్పుడు.. ఆమె నుండి ఎటువంటి స్పందనలేదు. ఈ విషాద వార్తను సోఫియా సవతి తండ్రి మైక్ రొమెరో వెల్లడించారు. ఆమె అంతిమ సంస్కారాల కోసం నిధుల సేకరణ వేదిక గోఫండ్‌మీలో పంచుకున్నారు.

GoFundMeలో హృదయ విదారక వార్తను ధృవీకరిస్తూ, సోఫియా సవతి తండ్రి మైక్ రొమెరో, కుటుంబం ఈ వార్త పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తోందని వెల్లడించారు. "ఆమె తల్లి, కుటుంబ సభ్యుల తరపున, మా ప్రియమైన సోఫియా మరణించిన వార్తను నేను బరువెక్కిన హృదయంతో పంచుకుంటున్నాను. సోఫియా ఆకస్మిక మరణం ఆమె కుటుంబాన్ని, స్నేహితులను కదిలించింది." అని తెలిపారు "సోఫియా తన అపార్ట్‌మెంట్‌లో మార్చి 1, 2024న చనిపోయిందని భావిస్తున్నాము. మరణానికి గల కారణాలపై స్థానిక పోలీసుల విచారణ ఇంకా కొనసాగుతోంది," అని అన్నారాయన.

Next Story