ఇండియాలో ల్యాండ్ అయిన హీరోయిన్.. ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్

బాలీవుడ్ నటి నుష్రత్ భరుచ్చా ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోవడం హాట్ టాపిక్ గా నిలిచింది.

By Medi Samrat  Published on  8 Oct 2023 5:58 PM IST
ఇండియాలో ల్యాండ్ అయిన హీరోయిన్.. ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్

బాలీవుడ్ నటి నుష్రత్ భరుచ్చా ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోవడం హాట్ టాపిక్ గా నిలిచింది. అయితే ఎట్టకేలకు ఆమె అక్టోబర్ 8న ముంబైకి చేరుకున్నారు. హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైన నుష్రత్.. ఇజ్రాయెల్- పాలస్తీనా వివాదం కారణంగా చిక్కుకుపోయింది. అక్టోబర్ 7 న నుష్రత్ తన బృందంతో కనెక్షన్ కోల్పోయింది. అక్టోబర్ 8 తెల్లవారుజామున ఎట్టకేలకు ఆమెతో కాంటాక్ట్ దక్కింది. నుష్రత్ సురక్షితంగా కనెక్టింగ్ ఫ్లైట్‌లో ఇజ్రాయెల్ నుండి భారతదేశానికి తిరిగి చేరుకుంది.

ఎంబసీ అధికారులు చొరవ తీసుకోవడంతో భరుచా ఎక్కడుందనే విషయం తెలిసింది. భరూచాతో ఫోన్ లో మాట్లాడామని ఆమె టీమ్ వెల్లడించింది. నుష్రత్ భరూచాను క్షేమంగా ఇండియా పంపించే ఏర్పాట్లు చేశామని, ప్రత్యేక విమానంలో భరూచా ముంబై బయలుదేరిందని ఎంబసీ అధికారులు అంతకుముందు తెలిపారు. ముంబై విమానాశ్రయంలో నుండి ఆమె బయటకు వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Next Story