దారుణం.. నిద్రలో ఉన్న తల్లి, ముగ్గురు తోబుట్టువులను.. కాల్చి చంపిన 14 ఏళ్ల బాలుడు

A 14-year-old boy who shot and killed his mother and three siblings. ఆన్‌లైన్ గేమ్ పబ్‌జీ ప్రభావంతో 14 ఏళ్ల బాలుడు తన తల్లి, ఇద్దరు మైనర్ సోదరీమణులతో సహా అతని మొత్తం కుటుంబాన్ని కాల్చి

By అంజి  Published on  29 Jan 2022 5:20 AM GMT
దారుణం.. నిద్రలో ఉన్న తల్లి, ముగ్గురు తోబుట్టువులను.. కాల్చి చంపిన 14 ఏళ్ల బాలుడు

ఆన్‌లైన్ గేమ్ పబ్‌జీ ప్రభావంతో 14 ఏళ్ల బాలుడు తన తల్లి, ఇద్దరు మైనర్ సోదరీమణులతో సహా అతని మొత్తం కుటుంబాన్ని కాల్చి చంపాడని పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ రాజధాని పోలీసులు శుక్రవారం తెలిపారు. నహిద్ ముబారక్ అనే 45 ఏళ్ల ఆరోగ్య కార్యకర్త గత వారం లాహోర్‌లోని కహ్నా ప్రాంతంలో ఆమె 22 ఏళ్ల కుమారుడు తైమూర్,17,11 ఏళ్ల ఇద్దరు కుమార్తెలతో కలిసి చనిపోయింది. గాయపడకుండా ఉండి కుటుంబంలో ఒంటరిగా ఉన్న ఆమె టీనేజ్ కొడుకు హంతకుడిగా తేలిందని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

"పబ్‌జీ గేమ్‌కు బానిస అయిన ఆ బాలుడు.. గేమ్ ప్రభావంతో తన తల్లి, తోబుట్టువులను చంపినట్లు ఒప్పుకున్నాడు. రోజులో ఎక్కువ గంటలు ఆన్‌లైన్ గేమ్ ఆడటం వల్ల అతను కొన్ని మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. నహిద్ విడాకులు తీసుకున్నారని, తన చదువుపై శ్రద్ధ పెట్టడం లేదని, ఎక్కువ సమయం పబ్‌జీ ఆడటం కోసం బాలుడిని హెచ్చరించేదని పోలీసులు తెలిపారు. "సంఘటన జరిగిన రోజు.. నహిద్ ఈ విషయంపై బాలుడిని మందలించింది. తరువాత బాలుడు అల్మారా నుండి ఆమె తల్లి పిస్టల్‌ను తీసి.. ఆమెను, అతని ఇతర ముగ్గురు తోబుట్టువులను నిద్రలోనే కాల్చి చంపాడు.

మరుసటి ఉదయం బాలుడు గట్టిగా కేకలు పెట్టాడు. ఇరుగుపొరుగు వారు పోలీసులను పిలిచారు. ఆ సమయంలో బాలుడు తాను ఇంటి పై అంతస్తులో ఉన్నానని, అతని కుటుంబం ఎలా చంపబడ్డాడో తెలియదని పోలీసులకు చెప్పాడు. లైసెన్స్ పొందిన పిస్టల్‌ను ఆమె కుటుంబ రక్షణ కోసం నహిద్ తన దగ్గర ఉంచుకుంటోందని, బాలుడు పిస్టల్‌ను కాలువలో పడేశాడని, కాలువ నుండి ఆయుధం ఇంకా స్వాధీనం చేసుకోలేదని పోలీసులు తెలిపారు. నిందితుడి రక్తంతో తడిసిన గుడ్డను స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు.

Next Story