ఈ 9 ఏళ్ళ బాలుడి సంపాదన చూస్తే షాక్ అవ్వాల్సిందే!

9 Y‌ear Old Boy Becomes Highest Paid Youtuber Reviewing Toys. సాధారణంగా తొమ్మిది సంవత్సరాల వయస్సు గల పిల్లలు అందరూ

By Medi Samrat  Published on  21 Dec 2020 8:37 AM GMT
ఈ 9 ఏళ్ళ బాలుడి సంపాదన చూస్తే షాక్ అవ్వాల్సిందే!

సాధారణంగా తొమ్మిది సంవత్సరాల వయస్సు గల పిల్లలు అందరూ ఎంతో చక్కగా ఆడుకుంటూ, స్కూల్ కి వెళుతూ వారి బాల్యాన్ని ఎంతో ఆస్వాదిస్తారు. మరికొంత మంది పిల్లలకు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పెయింటింగ్, డ్రాయింగ్,నైన్ సింగ్ వంటి వాటిలో ఆసక్తి ఉండటంతో వాటిని నేర్చుకోవడానికి శ్రద్ధ చూపిస్తుంటారు. కానీ అమెరికాకు చెందిన 9ఏళ్ల ర్యాన్ కాజీ మాత్రం ఇందుకు భిన్నంగా అతి చిన్న వయసులోనే మిలియన్ డాలర్లను సంపాదిస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నాడు. ఇంతకీ ర్యాన్ ఏ విధంగా మిలియన్స్ సంపాదిస్తున్నాడో ఇక్కడ తెలుసుకుందాం...

ప్రస్తుతం టెక్నాలజీకి అనుగుణంగా ఎంతో మంది యూట్యూబ్ చానల్స్ ఓపెన్ చేసి నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు. అదేవిధంగార్యాన్‌ కాజీ " ర్యాన్స్‌ వరల్డ్‌"అనే పేరుతో యూట్యూబ్‌ చానల్‌ ప్రారంభించాడు.

ఇందులో అతడు వివిధ రకాల బొమ్మలతో ఆడుకుంటూ వాటిని పర్యవేక్షిస్తూ ఉంటాడు. ఆవిధంగా ర్యాన్స్‌ వరల్డ్ చానల్ కి సుమారు 27 మిలియన్ కి పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు.

తాను ఆడుకుంటున్న వీడియోలను ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటాడు.ఎక్కువ మొత్తంలో సబ్స్క్రైబర్లు ఉండటం వల్ల ర్యాన్ నెలకు మిలియన్ డాలర్స్ సంపాదిస్తున్నాడు. 2018 సంవత్సరంలో ర్యాన్స్‌ వరల్డ్ చానల్ ద్వారా సుమారు 17 మిలియన్ డాలర్లను సంపాదించాడు. 2019లో 17 కాస్త 26 మిలియన్లకు చేరుకుంది. అయితే ఈ ఏడాది ఏకంగా 30 మిలియన్ డాలర్లకు చేరుకుంది. అంతేకాకుండా ర్యాన్‌ కాజీ వరుసగా మూడేళ్లలో అత్యధికంగా డబ్బులు సంపాదించిన యూట్యూబర్‌గా నిలవడం ఎంతో విశేషం.

ఇంతటి ఫాలోయింగ్ ఉన్న ర్యాన్‌ కాజీ మిలియన్ డాలర్ల విలువ చేసే నికెలోడియన్‌లో టీవీ సిరీస్ కోసం ఒప్పంద సంతకం కూడా చేశారు.ఇతను తన కుటుంబ సభ్యులందరికీ కలిపి దాదాపు తొమ్మిది యూట్యూబ్ చానల్స్ ఉండగా, అన్ని చానల్స్ మిలియన్ సంఖ్యలు వ్యూస్ రావడంతో ఒక్కసారిగా ర్యాన్ సెన్సేషనల్ స్టార్ అయిపోయారు. ఇంత చిన్న వయసులోనే మిలియన్ సంపాదించడంతో అందరూ ర్యాన్‌ పై పొగడ్తల వర్షం కురిపించారు.
Next Story