ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ చేసిన 89 ఏళ్ల వృద్ధుడు.. కారణం మాత్రం అదే

89 year old with a PhD in Physics. సాధారణంగా ఎవరైనా ఎదో ఒక చదువు చదివి.. ఓ మంచి ఉద్యోగం చేస్తే చాలు అనుకుంటారు. మంచి హోదాలో ఉండాలని కలలు

By అంజి  Published on  13 Nov 2021 11:27 AM IST
ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ చేసిన 89 ఏళ్ల వృద్ధుడు.. కారణం మాత్రం అదే

సాధారణంగా ఎవరైనా ఎదో ఒక చదువు చదివి.. ఓ మంచి ఉద్యోగం చేస్తే చాలు అనుకుంటారు. మంచి హోదాలో ఉండాలని కలలు కంటారు. చివరికి మంచి ఉద్యోగం, హోదా కాకపోయినా.. ఏదో ఒక ఉద్యోగంలో సెటిల్‌ అయిపోతుంటారు. ఉద్యోగం దొరికింది కదా అనుకుని లక్ష్యాలను వదిలేస్తారు. కొంతమంది మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంటారు. ఎంత వయస్సు వచ్చిన చేయాలనుకున్న దాన్ని చేసేదాకా వదలరు. వృద్ధ వయస్సు వచ్చిన తమ లక్ష్యాలపై ఆసక్తి పోదు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి యూఎస్‌లో చోటు చేసుకుంది. ఓ 89 ఏళ్ల వృద్ధుడు ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసి తన లక్ష్యాన్ని సాధించుకున్నాడు.

ఈస్ట్ ప్రొవిడెన్స్, రోడ్ ఐలాండ్‌లోని బ్రౌన్ యూనివర్సిటీతో తన పరిశోధనను విజయవంతంగా పూర్తి చేసినట్లు స్టైనర్‌ తెలిపాడు. 89 ఏళ్ల మాన్‌ఫ్రెడ్‌ స్టైనర్‌కి చిన్నప్పటి నుండి పీహెచ్‌డీ చేసి ఫిజిక్స్‌ గొప్ప శాస్త్రవేత్త కావాలని కలలు గన్నాడు. ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, మాక్స్‌ ప్లాంక్‌లను ఆదర్శంగా తీసుకున్నాడు. 1955లో స్టైనర్‌ తన తల్లి, మామ సూచన మేరకు వియన్నా యూనివర్సిటీలో వైద్య విద్య చదివాడు. ఆ తర్వాత అమెరికాలోని టఫ్ట్స్‌ యూనివర్సిటీలో హెమటాలజీ, మాసాచుసెట్స్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో బయెకెమిస్ట్రీ విద్యను పూర్తి చేశాడు. బ్రౌన్‌లోని మెడికల్‌ పాఠశాలలో హెమటాలజీ విభాగంలో 1994 వరకు స్టైనర్‌ సేవలు అందించాడు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో రిటైర్‌ అయ్యాడు.

అప్పటికే వైద్య పరిశోధనలో స్టైనర్‌ కుమంచి పట్టు ఉంది. అయినా తనకు భౌతికశాస్త్రం మీద మాత్రం ఆసక్తి పోలేదు. అప్పటికే స్టైనర్‌ వయస్సు 70 ఏళ్లు. బ్రౌన్‌ వద్ద అండర్‌ గ్రాడ్యుయేటర్ క్లాసులు తీసుకోవడం ప్రారంభించాడు. 2007 సంవత్సరం కల్లా పీహెచ్‌డీ చేసేందుకు కావాల్సిన అన్ని అర్హతలను స్టైనర్‌ సాధించాడు. ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ పట్టా సాధించడంపై స్టైనర్‌ ఫిజిక్స్‌ ప్రొఫెసర్ మాట్లాడారు. మొదట్లో స్టైనర్‌ను తన విద్యార్థిగా చేర్చుకునేందుకు సందేహించానని చెప్పారు. అయితే అతని అంకితభావాని ముగ్దుడునయ్యాని తెలిపారు. శాస్త్రీయ ఆలోచనా విధానం అభిరుచి స్టైనర్‌ దగ్గర చాలా ఉందని అన్నారు. స్టైనర్‌ ఫిజిక్స్‌లో పీహెచ్‌డీనీ పూర్తి చేయడం తన జీవితంలో అద్భుత విషయమని ప్రొఫెసర్‌ బ్రాడ్‌ మార్స్టన్‌ అన్నారు.

Next Story