శ్రీలంక దేశంలో విపరీతమైన నిత్యావసరాల మధ్య.. చేయడానికి ఎటువంటి పనిలేక ముగ్గురు పిల్లలతో సహా ఆరుగురు శ్రీలంక వాసులు పడవలో తమిళనాడులోని రామేశ్వరం చేరుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున దనుష్కోడి సమీపంలోని ఇసుక తిన్నెల వద్దకు తమ నాలుగు నెలల పాప, మరో మహిళ తన ఇద్దరు పిల్లలతో దంపతులు చేరుకున్నారు. రెండు కుటుంబాలలో ఒకరు జాఫ్నాకు చెందినవారు కాగా.. మరొకరు మన్నార్‌కు చెందినవారు. భారత తీర రక్షక దళం వారికి సమాచారం అందించడంతో, శరణార్థులను ఒడ్డుకు చేర్చేందుకు హోవర్‌క్రాఫ్ట్‌ను ఉపయోగించారు. వారికి అధికారులు ఆహారం, నీరు అందించారు. స్థానిక పోలీసులతో సహా అధికారులు కూడా వారితో మాట్లాడి, వారి గుర్తింపులను, శ్రీలంకను విడిచిపెట్టడానికి గల కారణాలను నమోదు చేశారు.
వారిలో ఒకరు, విలేకరులతో మాట్లాడుతూ తమ దేశంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల కారణంగా శ్రీలంకను విడిచిపెట్టి భారతదేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. పెరుగుతున్న ఆహారం, నిత్యావసరాల ధరలు, తమకు ఎటువంటి పని లేకపోవడం, వారి పిల్లల మనుగడ కోసం భారతదేశంలో శరణార్థులుగా మారడానికి సిద్ధమయ్యారు. శ్రీలంక వాసులు అక్రమంగా దేశంలోకి ప్రవేశించారని, వారిపై కేసు నమోదు చేసి జైలుకు పంపనున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.