నైజీరియాలో 400 మంది విద్యార్థుల కిడ్నాప్.‌!

400 Students Kidnapped In Nigeria. నైజీరియా దేశంలోని కట్సినా రాష్ట్రంలో ఓ మాధ్యమిక పాఠశాలపై ముష్కరులు దాడి చేశారు.

By Medi Samrat  Published on  14 Dec 2020 3:53 AM GMT
నైజీరియాలో 400 మంది విద్యార్థుల కిడ్నాప్.‌!

నైజీరియా దేశంలోని కట్సినా రాష్ట్రంలో ఓ మాధ్యమిక పాఠశాలపై ముష్కరులు దాడి చేశారు. పెద్ద సంఖ్య‌లో ఏకే-47 రైఫిల్స్‌తో కంక‌ర‌లోని ప్ర‌భుత్వ మాధ్య‌మిక‌ పాఠ‌శాల‌లోకి చొర‌బ‌డి కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. దాడి అనంత‌రం వందలాది మంది విద్యార్థులు తప్పిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు.

కాగ‌, ముష్క‌రులు త‌మ‌తో పాటు కొంత‌మంది విద్యార్ధుల‌ను బందీలుగా తీసుకెళ్లారని అక్క‌డి స్థానికులు చెబుతున్నారు. ఆ పాఠ‌శాల‌లో 600కి పైగా విద్యార్ధులుండ‌గా సుమారు 400 మందికి పైగా విద్యార్ధుల అచూకీ ఇప్పుడు ల‌భించ‌డం లేద‌ని పోలీసు విభాగం అధికార ప్ర‌తినిధి గాంబో ఇసా తెలిపారు. నైజీరియా సైన్యం, పోలీసులు విద్యార్థుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నాయని ఆయ‌న‌ తెలిపారు.


Next Story