సొంత ప్ర‌జ‌ల‌పై బాంబుల వ‌ర్షం కురిపించిన‌ పాక్ వైమానిక దళం.. 30 మంది మృతి

పొరుగు దేశం పాకిస్థాన్‌ నుంచి ఓ ఆశ్చర్యకరమైన వార్త బయటకు వచ్చింది.

By -  Medi Samrat
Published on : 22 Sept 2025 3:16 PM IST

సొంత ప్ర‌జ‌ల‌పై బాంబుల వ‌ర్షం కురిపించిన‌ పాక్ వైమానిక దళం.. 30 మంది మృతి

పొరుగు దేశం పాకిస్థాన్‌ నుంచి ఓ ఆశ్చర్యకరమైన వార్త బయటకు వచ్చింది. పాకిస్థాన్ వైమానిక దళం తన దేశ పౌరులపై బాంబుల వర్షం కురిపించింది. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో పాకిస్థాన్ వైమానిక దళం ఈ ఫీట్ చేసిందని చెబుతున్నారు. పాకిస్థాన్ వైమానిక దళం జరిపిన ఈ వైమానిక దాడిలో కనీసం 30 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారందరూ పాకిస్థాన్ పౌరులే. అదే సమయంలో ఈ బాంబు దాడిలో పలువురు గాయపడినట్లు సమాచారం.

NDTV పాకిస్తాన్ స్థానిక వార్తా నివేదికలను ఉటంకిస్తూ.. ఆదివారం అర్థరాత్రి పాకిస్తాన్ యుద్ధ విమానాలు తిరా లోయలోని మాత్రే దారా గ్రామంలో ఎనిమిది LS-6 బాంబులను జారవిడిచి, భారీ వినాశనానికి కారణమ‌య్యింది. ఈ ఘటన తర్వాత ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో చిన్నారులతో సహా పలువురి మృతదేహాలు పడి ఉన్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను రెస్క్యూ టీమ్‌లు బయటకు తీసే పనిలో నిమగ్నమై ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఈ బాంబు దాడిలో పలువురు గాయపడినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు శిథిలాల నుంచి ఇతరులను రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్‌లో ప్రస్తుతం అంతర్గత పరిస్థితులు, వైషమ్యాలు కొనసాగుతున్నాయని ఈ ఘటనతో స్పష్టమవుతోంది. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతం చాలా కాలంగా అల్ల‌ర్ల‌తో చెదిరిపోయింది. పాకిస్థాన్ ప్రభుత్వం ఇక్కడ నడవలేకపోవడానికి ఇదే కారణం.

Next Story