తీవ్ర‌వాది మీద విష ప్రయోగం..!

ముంబైలో 26/11 దాడులకు ప్రధాన కుట్రదారుల్లో ఒకడైన గ్లోబల్ టెర్రరిస్ట్, లష్కర్ కమాండర్ సాజిద్ మీర్ మీద విష ప్రయోగం జరిగింది.

By Medi Samrat  Published on  5 Dec 2023 7:00 PM IST
తీవ్ర‌వాది మీద విష ప్రయోగం..!

ముంబైలో 26/11 దాడులకు ప్రధాన కుట్రదారుల్లో ఒకడైన గ్లోబల్ టెర్రరిస్ట్, లష్కర్ కమాండర్ సాజిద్ మీర్ మీద విష ప్రయోగం జరిగింది. గతేడాది జూన్‌లో యాంటీ టెర్రరిజం కోర్టు మీర్‌కు శిక్ష విధించగా కోట్ లఖ్‌పత్ జైలులో ఉంచారు. జైలులో అతడి మీద విషప్రయోగం జరిగింది. సాజిద్ మీర్ వెంటిలేటర్‌పై ఉన్నాడని నివేదికలు చెబుతున్నాయి. సాజిద్ మీర్‌ను డేరా ఘాజీ ఖాన్ జైలుకు పంపేందుకు సన్నాహాలు జరుగుతున్న తరుణంలో ఈ విష ప్రయోగం జరిగింది. అమెరికా ఒత్తిడితో గతేడాది సాజిద్ మిర్‌ను అదుపులోకి తీసుకుంది.

లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ మహమూద్‌ ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం సహా ఉగ్రదాడులకు పాల్పడ్డాడనే కారణంతో 15 ఏళ్లు జైలు శిక్ష విధించింది. లాహోర్ సెంట్రల్ జైళ్లో ఉన్న సాజిద్ మిర్‌ను ఇటీవల డేరా ఘాజీ ఖాన్ సెంట్రల్ జైల్‌కు మార్చారు. పాకిస్తాన్‌లో తీవ్రవాదులను అంతం చేసే లక్ష్యంతో భారత్ పావులు కదుపుతోందని పాకిస్థాన్ ఆరోపిస్తూ ఉంది. ఇలాంటి హత్యలు దాడులు.. భారత్ ప్రమేయం ఉందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఆరోపిస్తూ ఉంది. సాజిద్ ను అమెరికాకు అప్పగించడాన్ని ఆపటం కోసం ఐఎస్‌ఐ విషప్రయోగం చేసినట్లుగా కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అతని తలపై అమెరికా ఎఫ్‌బీపీ 5 మిలియన్‌ యూఎస్‌ డాలర్లను ప్రకటించింది.

Next Story