అమెరికాలో మరో భారత సంతతి విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. ఫిలడెల్ఫియాలో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. జూడ్ చాకో (21) పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. జూడ్ కేరళలోని కొల్లాం జిల్లాలోని మలపెరూర్, అయూర్‌కు చెందిన రాయ్, కొట్టారక్కరకు చెందిన ఆశా దంపతుల కుమారుడు. కుటుంబం అమెరికాలో స్థిరపడింది. నివేదికల ప్రకారం, జూడ్ చివరిసారిగా ఆరేళ్ల క్రితం కేరళను సందర్శించాడు. ఫిలడెల్ఫియాలోని మలంకర క్యాథలిక్ చర్చిలో శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
జూడ్ చాకో ఓ వైపు చదువుకుంటూనే పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్నాడు. పని ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో జూడ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. యూఎస్‌లో భారతీయ సంతతికి చెందిన విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని హత్య చేయడం ఈ ఏడాది ఇది రెండో ఘటన. ఏప్రిల్ 21వ తేదీన అమెరికాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 24 ఏళ్ల విద్యార్థి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఓహోయోలోని ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న సాయూశ్ వీరపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు.