రాజస్థాన్‌లోని జుంజును జిల్లాలో సోమవారం నాడు ఘోర ప్రమాదం జరిగింది. ఓ ట్రాక్టర్ ట్రాలీ లోయలో పడిపోవడంతో ఆరుగురు మహిళలు, ఇద్దరు మైనర్లు సహా ఎనిమిది మంది మృతి చెందగా, మరో 26 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. సాయంత్రం బాధితులు కొండపై ఉన్న ఆలయం నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులందరినీ జుంజును, సికార్ జిల్లాల్లోని వివిధ ఆసుపత్రుల్లో చేర్పించినట్లు ఝుంఝును అదనపు పోలీసు సూపరింటెండెంట్ తేజ్‌పాల్ సింగ్ తెలిపారు. తాజా సమాచారం ప్రకారం.. మొత్తం 34 మంది బాధితులను ఆసుపత్రుల్లో చేర్చగా వారిలో ఎనిమిది మంది మరణించారని జుంఝును కలెక్టర్ ఖుషాల్ యాదవ్ తెలిపారు.
మృతుల్లో ఆరుగురు మహిళలు, ఇద్దరు మైనర్లు ఉన్నారని, ప్రాణాలతో బయటపడిన వారిలో చాలా మంది పురుషులు ఉన్నారని తెలిపారు. బాధితులు మతపరమైన కార్యక్రమం జరుగుతున్న మానస మాతా ఆలయం నుండి తిరిగి వస్తుండగా, ఆలయానికి దాదాపు ఒక కిలోమీటరు దూరంలో ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ట్రాక్టర్ ట్రాలీ అదుపు తప్పి స్తంభాన్ని ఢీకొని వాగులో పడిపోయినట్లు తెలుస్తోంది. ప్రాణాలతో బయటపడిన వారి కోసం ప్రమాద స్థలంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు అధికారులు. రాష్ట్ర మంత్రి రాజేంద్ర సింగ్ గూడా కూడా ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఉదయపూర్వతిలోని సిహెచ్‌సికి చేరుకుని అధికారులు, స్థానికులతో ప్రమాద ఘటనపై ఆరా తీశారు.